తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాల ప్రయాణాన్ని పూర్తి చేసిన నటుడు నాగార్జున కి ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేకమైన స్తానం ఉంది… ఇప్పుడు మన కింగ్ తన కెరీర్ లో 100th సినిమా చేయబోతున్నాడు. ప్రేమకథల నుండి యాక్షన్ సినిమాల వరకు, భక్తిరస నాటకాల నుండి హారర్ సినిమాల దాకా — ప్రతి జానర్లో తన ప్రత్యేక ముద్ర వేసిన ఆయన, ఇప్పుడు కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
ఇటీవలి కాలంలో హీరోగా నటించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, కుబేరాలో ధనుష్‌తో పాటు ‘దీపక్’ పాత్రతో, అలాగే రజనీకాంత్ కూలీలో ‘సైమన్’ విలన్ రోల్‌తో నాగార్జున మళ్లీ సూపర్ గా నటించారు.
ఇప్పుడు అందరి దృష్టి ఆయన 100వ సినిమా మీదే. పెద్ద డైరెక్టర్‌ను కాకుండా, తనకంటూ ప్రత్యేక కథన శైలి ఉన్న తమిళ దర్శకుడు రా కార్తిక్‌ను ఎంచుకున్నారు నాగ్. ఆయన తెరకెక్కించిన ‘నితం ఒక వానమ్’ సినిమా ద్వారా దర్శకుడి సెన్సిబిలిటీపై నాగ్ బాగా ఇంప్రెస్ అయ్యారట.
ఈ సారి పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నాగార్జున సొంత బ్యానర్ ‘మనమ్ ఎంటర్ప్రైజెస్’ పై రూపొందుతోంది. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమం సింపుల్‌గా జరిగింది. పెద్ద ప్రకటనలు లేకుండానే షూట్ కూడా ప్రారంభమైంది.
ప్రస్తుతం #King100 అనే వర్కింగ్ టైటిల్‌తో షూట్ జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారని సమాచారం. ‘లాటరీ కింగ్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందట.

ఈ ప్రత్యేక చిత్రం పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.