మెగాస్టార్ చిరంజీవి మన శంకర వర ప్రసాద్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే కదా… ఆల్రెడీ 300 కోట్ల క్లబ్ లో చేరి సూపర్ బ్లాక్బస్టర్ అయ్యింది. ఐతే ఈ సినిమా ని చిరంజీవి కూతురు సుష్మిత తో పాటు సాహు గారపాటి కూడా ప్రొడ్యూస్ చేసారు.
అలాగే ఈ సినిమా లో మెగా ఫామిలీ నుంచి ఇంకో మెంబెర్ కూడా ఉన్నారు… ఎవరబ్బా అనుకునేరు… తనే చిరు మేనకోడలు నైరా… పాప్ మ్యూజిక్ స్టూడెంట్ ఐన తను సింగపూర్ లో ఒక పాపులర్ కాలేజీ లో మ్యూజిక్ నేర్చుకుంటుంది. సో, ఈ సినిమా లో పిల్లలతో కలిసి చిరు స్కూల్లో ఉండేటప్పుడు వచ్చే పాప్ ఇంగ్లీష్ సాంగ్ నైరా నే పాడింది!
ఈ సంగతి నిన్న రిలీజ్ ఐన ప్రోమో లో నైరా చెప్తూ… చాల హ్యాపీ గా ఉందని కూడా చెప్పింది! సో, టాలీవుడ్ కి మరో మంచి పాప్ సింగర్ దొరికేసింది!
ఈ సంగతి మన శంకర వర ప్రసాద్ టీం సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేసారు… చిరు పిల్లలతో కలిసి ఎంత ఆనందంగా ఉన్నదో చుడండి…
అలాగే ఈ సినిమా లో నయన్ హీరోయిన్ కాగా, వెంకటేష్ ఒక చిన్న పాత్ర లో మెరిశాడు!