ఒకప్పుడు విజయవంతమైన కథానాయకుడిగా ప్రేక్షకులను అలరించిన నరేష్, తర్వాత సహాయ పాత్రల గా మారి, ఈరోజు versatile యాక్టర్ గా పేరు తెచ్చుకోవడం ఆయన సెకండ్ ఇన్నింగ్స్ ని స్పెషల్ గా నిలబెడుతుంది.
90s లో నరేష్ కామెడీ హీరోగా బాక్సాఫీస్‌ను ఏలిన రోజులు ఎన్నో ఉన్నాయి. అప్పట్లో వరుసగా వచ్చిన కామెడీ సినిమాలతో ఆయనకు బలమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. కానీ కాలం మారుతుందని గ్రహించిన నరేష్, హీరో పాత్రలకే అంటిపెట్టుకుని ఉండలేదు. తనను తాను మార్చుకున్నారు, కొత్త ట్రెండ్స్‌కు అనుగుణంగా ముందుకెళ్లారు. ఆ నిర్ణయమే ఈరోజు ఆయనను అత్యంత బిజీగా, ఎక్కువగా మాట్లాడుకుంటున్న నటుడిగా మార్చింది.
ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద స్టార్లు ఉన్న సినిమాల్లో కూడా నరేష్ గారి నటనే ప్రత్యేకంగా మెరిసింది. నారి నారి నడుమ మురారి సినిమాలో శర్వానంద్, ఇద్దరు కథానాయికలు ప్రధాన ఆకర్షణ అయినప్పటికీ, థియేటర్లలో పెద్ద నవ్వులు తెప్పించింది మాత్రం నరేష్ గారి కామెడీ టైమింగ్. ఆయన పాత్ర, దాని చుట్టూ రూపుదిద్దుకున్న హ్యూమర్ ప్రేక్షకులను వెంటనే కనెక్ట్ చేసింది. అంతకు ముందు సామజవరగమనా, కే రాంప్ వంటి సినిమాలకు కూడా నరేష్ ప్రెజెన్స్ మంచి బలం ఇచ్చింది.
ఇప్పుడు మరోసారి సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ కొత్త సినిమాలో ఆయన లుక్, పాత్ర రెండూ ప్రేక్షకులు ఊహించని విధంగా ఉండబోతున్నాయి. ఈ వయసులో కూడా లోపాలు ఉన్న, పొరలున్న పాత్రను చేయడం ఆయన నటనపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది.
65 ఏళ్ల వయసులోనూ ఆయన ఫిట్‌నెస్, స్క్రీన్ ప్రెజెన్స్, ఉత్సాహం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తున్నాయి.
త్వరలో నరేష్ గరివిడి లక్ష్మి, క్రేజీ కళ్యాణం, శుభకృత్ నామ సంవత్సరమ్, హే భగవాన్ వంటి సినిమాల్లో కనిపించనున్నారు. వినోదాత్మక పాత్రలతో తన జోరును అలాగే కొనసాగించబోతున్నారు.