సంక్రాంతి సినిమాల కోసం ఎంత వెయిట్ చేసాం కదా… మొత్తానికి సంక్రాంతి పండగ అయిపోయింది. ఇంకా అందరు ఈరోజు హైదరాబాద్ కి కూడా వచ్చేసారు. కానీ సంక్రాంతి సినిమాల విషయానికి వస్తే, ప్రభాస్ రాజా సాబ్ ఒక్కటి ప్లాప్ టాక్ తెచ్చుకున్న, మిగితా నాలుగు సినిమాలు గట్టెక్కాయి…
వాటిలో మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్ సూపర్ హిట్ అవ్వగా, శర్వానంద్, మన సంక్రాంతి హీరో ‘నారి నారి నడుమ మురారి’ సినిమా కూడా బ్లాక్బస్టర్ హిట్ అయ్యింది. ఇంకా నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమా కూడా బ్లాక్బస్టర్ ఏ… ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ నే కాదు, సోషల్ మీడియా ని కూడా షేక్ చేస్తున్నాయి…
కేవెలం నాలుగు రోజుల్లో ఈ సినిమా 82 కోట్లు కల్లెక్ట్ చేసి, వంద కోట్ల మార్క్ కి చేరువలో ఉంది… ఇంకో రెండు రోజులు గట్టిగా సినిమా థియేటర్స్ లో ఆడితే, ఈ మార్క్ కూడా దాటితుంది. ఈరోజు ఆదివారం కాబట్టి, కచ్చితంగా ఆ మార్క్ చూస్తాం అని నిర్మాతలు చెపుతున్నారు!
నవీన్ కూడా తన సినిమా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ సోషల్ మీడియా లో పోస్ట్ చేసి, ఫాన్స్ కి ఆడియన్సు కి స్పెషల్ థాంక్స్ చెప్పాడు… ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్ కాగా, స్టోరీ కూడా నవీన్ ఏ రాసాడు!