సంక్రాంతి పండుగా నిన్నటితో అయిపోయినా… సంక్రాంతి సినిమాల హడావిడి మాత్రం థియేటర్స్ దెగ్గర తగ్గట్లేదు. ఫస్ట్ లో వచ్చిన రాజా సాబ్ హవా తగ్గినా కానీ తరవాత లైన్ గా వచ్చిన మెగాస్టార్ మన శంకర వర ప్రసాద్, నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుమ మురారి హిట్ అయ్యాయి… రవి తేజ భర్త మహాశయులు మూవీ అవేరేజ్ టాక్ తెచ్చుకుంది.
ఇక మెగాస్టార్ సినిమా ఆల్రెడీ 250 కోట్ల కలెక్షన్ చేసింది… ఇక నెక్స్ట్ నవీన్ పోలిశెట్టి సినిమా కూడా గట్టి పోటీ ఇస్తుంది… క్లీన్ కామెడీ ఇంకా నవీన్ ఎనర్జీ సినిమా మొత్తాన్ని నడిపించింది! ఇక బ్లాక్బస్టర్ ఐన ఈ సినిమా కలెక్షన్స్ కూడా సూపర్ గా ఉన్నాయ్…
మొత్తం మూడు రోజుల్లో 61.1 కోట్లు కలెక్ట్ చేసి, అబ్బో ఈ సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరుతుందా ఏంటి అని అనిపిస్తుంది… నవీన్ పోలిశెట్టి కూడా లేటెస్ట్ కలెక్షన్ రిపోర్ట్ ని షేర్ చేస్తూ, తన ఆనందాన్ని నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు…
ఈ సినిమా లో నవీన్ తో పాటు మీనాక్షి కూడా చాల బాగా ఎంటర్టైన్ చేసింది. ఇక స్టోరీ విషయానికి వస్తే, నవీన్ తాత జమీందార్ కానీ నవీన్ కి ఆస్థి ఏమి మిగిలించకుండా పోతాడు… సో, నవీన్ మళ్ళి తనకి గోల్డెన్ డేస్ రావాలని, డబ్బున్న పిల్ల మీనాక్షి ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు… సో, స్టోరీ లైన్ సింపుల్ ఐన కానీ నవీన్ తన కామెడీ తో మొత్తం నడిపించి, పొట్ట చెక్కలయ్యేల చేసాడు!