సంక్రాంతి సినిమాల హడావుడి మాములుగా లేదు… ఆల్రెడీ మెగాస్టార్ ‘మన శంకర వర ప్రసాద్’ ఇంకా ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ట్రైలర్స్ కూడా రిలీజ్ అయ్యి సూపర్ హైప్ ని పెంచేసాయి. ఇక ఇప్పుడు నవీన్ పోలిశెట్టి ‘అనగనగ ఒక రాజు’ ట్రైలర్ చూసే టైం వచ్చింది అనమాట…
ఈ సినిమా తో నవీన్ మళ్ళి కం బ్యాక్ ఇస్తున్నాడు! ఆల్మోస్ట్ 2 ఇయర్స్ తరవాత మళ్ళి పెద్ద తెర ని పలకరించబోతున్నాడు! అలానే తన కంఫర్ట్ జోన్ ఫామిలీ కామెడీ జోనర్ లో ‘అనగనగ ఒక రాజు’ తో జనవరి 14 న రాబోతున్నాడు!
ఎలాగో సినిమా రిలీజ్ డేట్ దెగ్గర పడుతుండడం తో ట్రైలర్ ని ఎల్లుండి అంటే 7th జనవరి న లాంచ్ చేస్తున్నాం అని నిర్మాతలు సోషల్ మీడియా లో అనౌన్స్ చేసారు. అనౌన్స్మెంట్ పోస్టర్ లో కూడా నవీన్ రాజు లాగ ఉయ్యాలలో కనిపించాడు.
సో, ఈ సంక్రాంతికి ఇంటింటా నవ్వుల మోతె…