ఈ మధ్య యాక్టర్స్ సింగర్స్ గా మారి పాటలు పాడడం చూస్తున్నాం కదా… ఆల్రెడీ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ ఒక సాంగ్ కూడా పాడాడు. ఇప్పుడు అదే ట్రెండ్ ని ఫాలో అవుతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.
ఆల్మోస్ట్ two ఇయర్స్ తరవాత ‘అనగనగ ఒక రాజు’ సినిమా తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సినిమాలో ఫస్ట్ సాంగ్ కూడా పడేసాడంట… “భీమవరం బల్మ…” అనే ఈ సాంగ్ 27th న రిలీజ్ అవుతుంది… బి రెడీ!
లేటెస్ట్ గా రిలీజ్ ఐన సాంగ్ ప్రోమో లో సింగర్ anchor సమీరా భరద్వాజ్ తో కలిసి అలరించాడు… ఈ ప్రోమో లో సిద్ధూ సింగర్ గా ఇచ్చే టిప్స్ సూపర్. లాస్ట్ పంచ్ మనోడికి పడింది మరి!
ఈ సినిమాలో మీనాక్షి హీరోయిన్… ఇక MAD సినిమాతో నవ్వించిన కళ్యాణ్ డైరెక్టర్… అన్నిటికన్నా మించి ఈ సినిమా పండగ బొమ్మ గా సంక్రాంతికి అలరించబోతోంది! రెడీ గా ఉండండి!