టాలీవుడ్ లో నిధి అగర్వాల్ తన కెరీర్ లో ఇప్పుడు చాల పీక్ స్టేజి లో ఉంది… ఒకేసారి అటు డార్లింగ్ ప్రభాస్ రాజా సాబ్ లో ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు లో చేసే అవకాశం దొరికింది… ఇలా ఇద్దరు పెద్ద హీరోలతో చేయడం వెంట వెంటనే చాల మంది హీరోయిన్స్ కి దొరకని అవకాశం!
ఐతే ఎప్పుడు మీడియా కి ఇంటర్వ్యూస్ ఇస్తూ యాక్టీవ్ గా ఉండే నిధి, లేటెస్ట్ పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ మీద చాల ప్రశంసలు కురిపించింది!
‘‘పవన్ కల్యాణ్ ఎంతోమందికి దేవుడితో సమానం. ఆయనంటే అంత క్రేజ్ ఉంది. అలాంటి అభిమానం కొందరికి మాత్రమే సొంతం. ఆయన కూడా అభిమానులను అలానే చూసుకుంటారు. ఆయనతో కలిసి వర్క్ చేసేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. కలిసిన అందరితో బాగా మాట్లాడతారు. ‘హరిహర వీరమల్లు’కు వర్క్ చేసే సమయంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి ‘మీరు మా దేవుడితో వర్క్ చేస్తున్నారు’ అని అనేవారు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. వందశాతం కష్టపడతారు. ఎలాంటి విషయాన్నైనా ధైర్యంగా చెబుతారు. నిజాయతీగా ఉంటారు. సినిమాలతో సంబంధం లేకుండా ప్రజలు ఆయన్ని ఇష్టపడతారు. భవిష్యత్తులో ఆయన ప్రధాని అయినా ఆశ్చర్యపడను’’ అని నిధి అన్నారు.
అలాగే PR వ్యవస్థ గురించి కూడా చెప్తూ, ‘‘ఒకరిని ఉన్నతస్థానాలకు తీసుకెళ్లడానికి కాకుండా.. తొక్కేయడానికి భారీగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. నటీనటులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. నెగెటివ్ ప్రచారం వల్ల మానసికంగా కుంగిపోతారు. వాళ్లతో పాటు వాళ్ల కుటుంబాలు కూడా ఎంతో బాధను అనుభవిస్తాయి’’, అని చాల క్లారిటీ గా చెప్పింది ఈ బ్యూటీ!