మెగా డాటర్ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? తాను హీరోయిన్ గా మంచి సినిమాలు చేసినా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ప్రొడ్యూసర్ గా బిజీ గా ఉంది. ఆల్రెడీ ఫస్ట్ సినిమా కమిటీ కుర్రాళ్ళు తో బ్లాక్బస్టర్ కొట్టింది మెగా డాటర్. ఇంకా ఇప్పుడు తన సెకండ్ సినిమా కోసం రెడీ అవుతుంది… ఐతే కొన్ని నెలల క్రితమే యంగ్ హీరో సంగీత్ శోభన్ తో సినిమా చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు కదా…
ఇక ఇందాకే, నిహారిక ప్రొడ్యూసర్ గా సంగీత్ కొత్త సినిమా టైటిల్ ‘రాకాస’ గా అనౌన్స్ చేసారు. టైటిల్ పోస్టర్ అదిరిపోయింది… అందులో ఓ పాత భవనం లో సంగీత్ ఒక ఫైర్ టార్చ్ లాంప్ పట్టుకుని ఎదో వెతుకుతున్నట్టు చూపించారు.
ఇక ఈ సినిమా ని యంగ్ డైరెక్టర్ మానస డైరెక్ట్ చేస్తుండగా, ఉమేష్ కుమార్ బన్సల్ జీ స్టూడియోస్ ఇంకా పింక్ ఎలెఫంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమా ౩ర్డ్ ఏప్రిల్ న రిలీజ్ అవ్వడానికి సిద్ధం గా ఉంది. అలాగే ఈరోజు ఈవెనింగ్ ఫస్ట్ గ్లింప్సె కూడా రిలీజ్ చేస్తారంట!