ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ ‘డ్రాగన్’… మన యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ లెజెండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా, దాదాపు ఆరు నెలల విరామం తర్వాత ఎట్టకేలకు ఈ శనివారం మళ్లీ సెట్స్ మీదకు అడుగు పెట్టబోతోంది. మొదటి షెడ్యూల్లోనే పలు భారీ యాక్షన్ బ్లాక్స్ ట్రై చేసిన టీమ్, ఇప్పుడు సెకండ్ ఫేజ్‌ను మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది.

ఈసారి షూటింగ్ చాలా వరకూ నైట్ షెడ్యూల్స్‌లోనే జరగబోతోందట. నీల్ మార్క్ డార్క్ టోన్, రా యాక్షన్, మోడరన్ వైబ్స్, ఒక కొత్త విండోల్డ్ను చూపించబోతున్నారని మేకర్స్ ఇచ్చిన సమాచారం.
ఇక అసలైన సర్ప్రైజ్ ఏమిటంటే… ‘డ్రాగన్’ ఇక రెండు పార్ట్స్‌గా రానుంది! కథ డిమాండ్ చేస్తుంది కాబట్టి రెండు భాగాలుగా చేసేందుకు నిర్ణయించారని తెలుస్తోంది. దీంతో ప్రాజెక్ట్‌కు స్కేల్, రేంజ్, అంబిషన్ అన్ని నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.