పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కరెక్ట్ స్టోరీ తో కరెక్ట్ టైం లో రిలీజ్ అయితే ఎంత పెద్ద హిట్ అవుతుందో సుజిత్ OG నిరూపించింది. అసలు పవన్ కత్తి పట్టి, గుండాలని, విలన్స్ ని చంపుతుంటే అబ్బో సూపర్… అలానే హీరోయిన్ తో లైట్ రొమాన్స్ చేస్తూ, పాటలు అదిరిపోతే సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. OG సినిమా తరవాత నెక్స్ట్ హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు పవన్.
ఈ సినిమా ఈ సమ్మర్ లో రిలీజ్ అంటున్నారు… చూద్దాం! ఇక నెక్స్ట్ పవన్ సినిమాలు ఉండవా అంటే, అయ్యో మొన్నే కదా న్యూ ఇయర్ సందర్బంగా సురేందర్ రెడ్డి తో సినిమా అనౌన్స్ చేసారు. ఈ సినిమా కి నిర్మాత రామ్ తల్లూరి. సో, ప్రత్యేకంగా ఈ సినిమా కోసమే ‘జైత్ర రామ మూవీస్’ బ్యానర్ లాంచ్ చేసారు కూడా.

ఈ సినిమా షూటింగ్ కూడా తొందరలోనే ఉంటుంది అంటున్నారు చూద్దాం… ఐతే నిన్న రిలీజ్ అయిన మన శంకర వర ప్రసాద్ సినిమా అప్పుడే సూపర్ హిట్ అయ్యింది. సో, దర్శకుడు అనిల్ నెక్స్ట్ సినిమా ఎవరితో అన్న టాపిక్ వస్తుంది. పెద్ద హీరోలందరూ బిజీ నాగార్జున తో సహా… కానీ అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పవన్ కళ్యాణ్ తో అంటున్నారు. మరి ఎంత వరకు నిజమో తెలీదు… యాక్టుల్ గా అనిల్ రావిపూడి ఒక సినిమా బయట బ్యానర్ తో ఒక సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేస్తాడని SVC ఓనర్ శిరీష్ ఆల్రెడీ చెప్పారు.
కానీ అంత బాగుంది అనుకునేలోపు, పవన్ కళ్యాణ్ తో ఈరోజు people మీడియా ఫ్యాక్టరీ ఓనర్ TG విశ్వా ప్రసాద్ భేటీ అయ్యారు… ఆమ్మో ఇదేం కొత్త ట్విస్ట్… ఈ విషయాన్నీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ పేజీ ద్వారా నెటిజన్స్ కి షేర్ చేసారు… సో, సంక్రాంతి రోజు ఏమైనా కొత్త సినిమా కబురు చెప్తారా అని వెయిట్ చేయాలి!