పోలా… అదిరిపోల… అసలు నార్మల్ సినిమాలు 100 కోట్ల కలెక్షన్ దాటాలంటే మినిమం ఒక వన్ వీక్ పడుతుంది కదా… కానీ మన పవన్ కళ్యాణ్ OG మాత్రం మొదటి రోజే 150 కోట్ల కలెక్షన్ దాటేసింది…
ఈ విషయాన్ని నిర్మాతలు అధికారికంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేసారు కూడా… మీరు చూసేయండి మన పవన్ కళ్యాణ్ మరో రాజసమైన పోస్ట్…
నిన్న పవన్ కళ్యాణ్ OG నిన్న పలు భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. విడుదలైన మొదటి రోజే సినిమా మీద అద్భుతమైన రెస్పాన్స్ ఇంకా పాజిటివ్ మౌత్ పుబ్లిసిటి వచ్చింది. అంతేకాకుండా బుధవారం రాత్రి ప్రీమియర్స్‌కే పాజిటివ్ టాక్ రావడంతో మొదటి రోజు కలెక్షన్లపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.
అందుకే “ఇది పవన్ కళ్యాణ్ సినిమా….. #OG Erases History 🔥 Worldwide Day 1 Gross – 154 Cr+ 💥” అంటూ నిర్మాతలు పోస్టు చేశారు.
తెలుగు మాత్రమే కాకుండా హిందీ సహా అన్ని భాషల్లో ఈ సినిమాకు మంచి రివ్యూలే వచ్చాయి. తమిళంలోనూ, ఇతర భాషల్లోనూ బాగానే ఆడుతోంది. పాన్ ఇండియా స్టార్ కాస్టింగ్ ఉన్నందువల్ల బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ అయ్యింది.
ఇకపై వచ్చే వీకెండ్, సెలవు సీజన్ కూడా ఈ సినిమాకు బాగా అండగా నిలుస్తాయి. ఈ పాజిటివ్ వేవ్ కొనసాగితే, OG కూడా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి చేరే అవకాశముందని టాక్ ఉంది. కానీ ఇప్పుడే ఏదైనా ఫైనల్‌గా చెప్పడం తొందరపాటు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అందుకే ఈ సెప్టెంబర్ అద్భుతం అసలా… మొదట లిటిల్ హార్ట్స్, నెక్స్ట్ కిష్కింధపూరి నెక్స్ట్ మిరాయి ఇప్పుడు OG ఇది చాలదు సినిమా ఫాన్స్ కి ఏమంటారు???