Native Async

OG Updates: పవన్‌ కళ్యాణ్‌ ఓజీ ప్రేక్షకులను మెప్పించిందా లేదా?

Pawan Kalyan OG Live Updates
Spread the love

ఓవరాల్‌గా OG సినిమా ఫ్యాన్స్‌ కోసమే తీసినట్టుంది. పవర్‌ స్టార్‌ అభిమానులు ఆయన్ను ఎలా మాస్‌ హీరోగా చూడాలని అనుకున్నారో ఆవిధంగా చూపించాడు సుజిత్‌. దానికి తగ్గట్టుగా థమన్‌ బీజీఎం అందించాడు.

Second Half Report

సెకండ్‌ హాఫ్‌లో పోలీస్‌ స్టేషన్‌ సీన్, అర్జున్‌దాస్‌కు సంబంధించిన సన్నివేశాలు, ప్రీక్లైమాక్స్‌, క్లైమాక్స్‌ సీన్స్‌ బాగున్నాయి. పవన్‌ అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ పెట్టిందనే చెప్పాలి. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఫ్యాన్స్‌ కోసం తీసిన మాస్‌ మసాలా మూవీ ఇది.

  • ఓ ఆసక్తికరమైన మలుపుతో సినిమా ముగుస్తుంది. ఫ్యాన్స్‌ విజిల్స్‌ వేస్తూ థియేటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు.
  • ఓజస్‌, ఓమి మధ్య ఇంటెన్సీవ్‌ ఫైట్‌ జరుగుతున్నది.
  • కథ క్రమంగా క్లైమాక్స్‌కు చేరుకుంది.
  • మరోవైపు ఓమి తాను అనుకున్న ప్లాన్‌ను అమలు చేసేందుకు వేగంగా ప్లాన్‌ కదుపుతుంటాడు. మరి ప్లాన్‌ వర్కౌట్‌ అవుతుందా? చూడాలి.
  • అర్జున్‌ దాస్‌ మరోసారి ఎంట్రీ ఇస్తాడు. తన బాల్యానికి సంబంధించిన ఓ షాకింగ్‌ ట్విస్ట్‌ రివీల్‌ అవుతుంది.
  • విలన్‌ ఓమి విధ్వంసం సృష్టించేందుకు ప్లాన్‌ చేస్తారు. అయితే, ఓజీ అతడిని ఆపేందుకు సన్నద్ధమౌతాడు. ఓజీ, ఓమి ఎత్తులు పైఎత్తులతో సీన్స్‌ రసవత్తరంగా సాగుతున్నాయి.
  • కథలో ట్విస్ట్‌ వస్తోంది.
  • ఇక్కడే ఓజస్‌ పవన్‌ కళ్యాణ్‌, విలన్‌ ఓమి ఎదురెదురౌతారు. ఈ సన్నివేశాలు నెక్ట్స్‌ సీన్స్‌ని హైలైట్‌ చేసేలా ఉన్నాయి.
  • ఎవరైతే తన వారిని బెదిరించారో వారికి వార్నింగ్‌ ఇచ్చేందుకు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్తాడు. అక్కడ పోలీస్‌ ఆఫీసర్‌తో గొడవకు దిగుతాడు.
  • సెకండ్‌హాఫ్‌లో కీలక సన్నివేశాలు ప్లే అవుతున్నాయి. ముంబై నుంచి వెళ్లిపోయిన ఓజీ తిరిగి వస్తాడు.
  • పవన్‌ కళ్యాణ్‌, ప్రియాంక మోహన్‌ మధ్య ఓ ఎమోషనల్‌ సాంగ్‌ ప్లే అవుతున్నది.
  • సెకండ్‌ హాఫ్‌ ఇప్పుడే ప్రారంభమైంది.

First Half Report

ఫస్ట్‌హాఫ్‌ స్టోరీ నరేషన్‌, యాక్షన్‌ పార్ట్స్‌, పవన్‌ కళ్యాణ్‌ స్టైలిష్‌ యాక్షన్‌ సూపర్బ్‌. యాక్షన్‌ సీన్స్‌ అద్భుతం. పవన్‌ కళ్యాణ్‌ను అభిమానులు ఎలా చూడాలని అనుకున్నారో సుజిత్‌ ఆ విధంగా చూపించాడు. అందరిలోనూ సెకండ్‌ హాఫ్‌ ఎలా ఉండబోతుందా అని ఎదురు చూసేలా ఫస్ట్‌హాఫ్‌ ఎండింగ్‌ ఉంది.

  • మొత్తానికి విరామం పడింది.
  • సీన్స్‌ క్రమంగా విరామం దిశగా పయనిస్తున్నాయి. ఓజీ, ఓమి మధ్య సమరం ప్రారంభం కాబోతున్నది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ సీన్స్‌ హైలైట్‌ అని చెప్పాలి.
  • అనుకోని కొన్ని షాకింగ్‌ సన్నివేశాలు ప్లే అవుతున్నాయి. ఓజస్‌ మరోసారి తన కత్తికి పనిచెప్పేందుకు సిద్దమౌతున్నాడు.
  • ఓజస్‌ పవన్‌ కళ్యాణ్‌ తిరిగి వచ్చే సన్నివేశాలకు సంబంధించిన సీన్స్‌ వస్తున్నాయి. పవన్‌ రాకకోసం ఎదురు చూస్తున్నారు. సినిమాలోని క్యారెక్టర్స్‌తో పాటు థియేటర్‌లోని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
  • బాలీవుడ్‌ రొమాంటిక్‌ హీరో ఇమ్రాన్‌ హష్మి ఓ స్టైలిష్‌ ఎంట్రీతో పరిచయమయ్యాడు. ఎంట్రీ సింప్లీ సూపర్బ్‌.
  • సాంగ్‌ టైమ్‌ వచ్చేసింది. సువ్వి సువ్వి అనే రొమాంటిక్‌ సాంగ్‌ ప్లే అవుతున్నది. విజువల్స్‌ చాలా రొమాంటిక్‌గా ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ లుక్స్‌ ఆకట్టుకునేవిధంగా ఉన్నాయి.
  • పవన్‌ కళ్యాణ్‌ భార్యగా ప్రియాంక మోహన్‌ పరిచయానికి సంబంధించిన సీన్స్‌ ప్లే అవుతున్నాయి.
  • పవన్‌ కళ్యాణ్‌ ఓజస్‌ ఎంట్రీ, ఇంటెన్సీవ్‌ సీన్స్‌ తరువాత…క్రమంగా స్టోరీ ఓజస్‌ గతంలోకి వెళ్తుంది. తన గతానికి సంబంధించిన సీన్స్‌ ప్లే అవుతున్నాయి.
  • గ్యాంగ్‌లీడర్‌ జిమ్మి ముఖ్యమైన ఓ కంటెయినర్‌ కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలో వచ్చే సీన్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. నెక్ట్స్‌ ఏం జరగుతుందా అనే ఉత్కంఠ నెలకొంది.
  • ఓజస్‌గా పవన్‌ కళ్యాణ్‌ గ్రాండ్‌ ఎంట్రీ. ఎట్రీ సీన్స్‌ పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. పవన్‌ ఎంట్రీ తరువాత కథ ఆసక్తికరంగా మారింది.

  • మెయిన్‌ లీడ్‌ రోల్‌కి సంబంధించిన సీన్స్‌ చాలా క్రేజీగా ఉన్నాయి. ఓ ఫైట్‌ సీన్‌తో గ్రాండ్‌ ఎంట్రీగా చూపించారు. ప్రస్తుతం ఆ లీడ్‌రోల్‌కు సంబంధించిన కొన్ని ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ వస్తున్నాయి.
  • బాంబే నగరంలో హటాత్తుగా టెన్సన్‌ వాతావరణం నెలకొంటుంది. అర్జున్‌దాస్‌, శ్రీయారెడ్డికి సంబంధించిన ఇంట్రడక్షన్‌ సీన్స్‌ వస్తున్నాయి.
  • ఇప్పుడు కథ 1970 నుంచి 1993కి మారినట్టు టైటిల్‌ను బట్టి తెలుస్తోంది. బాంబేలో కథ మొదలైంది.
  • పవన్‌ కళ్యాణ్‌ ఎంట్రీ క్రేజీగా ఉంది. పవన్‌ కళ్యాణ్‌పై ఓజీ టైటిల్‌ కార్డ్‌ సరికొత్తగా ఉంది.
  • ఓపెనింగ్‌ వింటేజ్‌ షాట్స్‌ వావ్‌ అనిపించేలా ఉన్నాయి. కథ 1940లో మొదలై క్రమంగా 1970కి మారుతుంది. సమురాయ్‌, మాఫియా మధ్య యుద్ధం థియేటర్లో క్లాప్స్‌ కొట్టించేలా ఉంది. సుజిత్‌ తనతైన శైలిలో ఈ సీన్స్‌ని మలిచాడు.
  • 2 గంటల 34 నిమిషాల నిడివితో ఓజీ సినిమా షో ఇప్పుడే మొదలైంది. ఓజీ టైటిల్‌ మయా క్రేజీగా ఉంది. థమన్‌ బీజీఎం టైటిల్‌ కార్డ్‌ సూపర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *