ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి పవన్ కళ్యాణ్ న్యూ లుక్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుంచి వచ్చిన కొత్త పోస్టర్ న్యూ ఇయర్‌ను అభిమానులకు మరింత స్పెషల్‌గా మార్చింది. ఎరుపు రంగు షర్ట్, డెనిమ్ జీన్స్‌లో పవన్ కళ్యాణ్ కనిపించిన లుక్ అదిరిపోయింది. చేతిలో వింటేజ్ బూమ్‌బాక్స్, మరో చేతిలో షాట్‌గన్‌తో కనిపిస్తూ పవన్ కళ్యాణ్ చూపించిన స్వాగ్ మాములుగా లేదు! ఈ లుక్ చూస్తేనే సినిమా ఓ హై ఎనర్జీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందన్న ఫీలింగ్ కలుగుతుంది. రెట్రో స్టైల్‌కు మోడ్రన్ యాక్షన్‌ను మిక్స్ చేసిన క్యారెక్టర్‌గా పవన్ కళ్యాణ్ అభిమానులను మెస్మరైజ్ చేస్తున్నాడు.

పవన్ కళ్యాణ్‌ను అత్యంత స్టైలిష్‌గా చూపించడంలో దిట్ట అయిన దర్శకుడు హరీష్ శంకర్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ ఆయన డీటెయిలింగ్ స్పష్టంగా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సహజమైన చరిస్మా, హరీష్ శంకర్ విజన్ కలిసివచ్చి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ను ఒక విజువల్ స్పెక్టాకిల్‌గా మలుస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో, టాలీవుడ్ యాక్షన్-డ్రామా జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంగా ఈ సినిమా నిలవనుంది.

ఇక ఈ సినిమాపై హైప్ మరింత పెంచింది ఫస్ట్ సింగిల్ “దేఖేంగే సాలా” సూపర్ సక్సెస్. విడుదలైన కొద్ది సమయంలోనే ఈ పాట చార్ట్‌బస్టర్‌గా మారి మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్, ఎయిర్‌వేవ్స్‌ను డామినేట్ చేస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ఎనర్జిటిక్ మ్యూజిక్ ఈ పాటను సినిమాకు ఒక అనధికారిక యాంతమ్‌గా మార్చేసింది. ప్రమోషన్ క్యాంపెయిన్‌కు ఈ సాంగ్ మరింత బూస్ట్ ఇచ్చిందని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *