సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ‘జన నాయకన్’ సినిమా లో హీరోయిన్… ఐతే ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాల్సి ఉండగా, కోర్ట్ కారణాల వల్ల ఆగింది! విజయ్ లాస్ట్ సినిమా కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక కొంతకాలంగా పూజా హెగ్డే సినిమాల ప్రమోషన్స్, మీడియా ఇంటర్వ్యూలకు దూరంగా ఉంటోంది. అయితే ఇదే సమయంలో, ఆమెకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ స్టార్ హీరో తనతో హద్దులు దాటిన ప్రవర్తన చేశాడంటూ పూజా హెగ్డే చెప్పిందని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచారం చేశాయి.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న కథనాల ప్రకారం… “సినీ ఇండస్ట్రీలో కొందరు ప్రాథమిక హద్దులు కూడా మర్చిపోతారు. ఓ పాన్ ఇండియా సినిమా షూటింగ్ సమయంలో ఒక స్టార్ తన అనుమతి లేకుండా తన క్యారవాన్‌లోకి వచ్చాడట. అప్పుడు తాను ఎదురు తిరిగి అతడిని చెంపదెబ్బ కొట్టానని, ఆ తర్వాత అతడు తనతో మళ్లీ ఎప్పుడూ పని చేయలేదని” పూజా హెగ్డే అన్నట్లు వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమవుతోంది. ఇటీవల కాలంలో పూజా హెగ్డే అలాంటి సంఘటనను ఎక్కడా ప్రస్తావించలేదు. ఏ ఇంటర్వ్యూలోనూ, ఏ పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌లోనూ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
కేవలం కొన్ని మీడియా హౌసెస్, సోషల్ మీడియా పేజీలు పూజా పేరు ట్యాగ్ చేస్తూ, ఆమె ఎప్పుడూ చెప్పని మాటలను ఆమెకు ఆపాదిస్తూ ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, వాస్తవాన్ని చెక్ చేయకుండానే కొంతమంది వెబ్సైట్లు ఈ వార్తలను మరింత పుష్ చేయడం విమర్శలకు దారి తీస్తోంది.
ఇలాంటి నిరాధార వార్తలు సెలబ్రిటీల ఇమేజ్ను దెబ్బతీసే ప్రమాదం ఉందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అధికారికంగా పూజా హెగ్డే నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో, ఈ వార్తలన్నీ పూర్తిగా ఫేక్ అన్నది స్పష్టమవుతోంది.
వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే… పూజా హెగ్డే ప్రస్తుతం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘కాంచన 4’, ‘డీక్యూ 41’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఈ సినిమాల ద్వారా మళ్లీ ఫుల్ ఫ్లెజ్డ్ రీ-ఎంట్రీ ఇవ్వాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.