మనం చాల సినిమాల్లో సైన్స్ కి శాస్త్రం కి పోటీ చూసాం… కానీ ఆది సాయి కుమార్ నటించిన శంబాలా సినిమా వేరేలా ఉండేటట్టు ఉంది… కాన్సెప్ట్ అదే కానీ ఇప్పటి కథ, ఇప్పటి సైన్స్ ఇంకా శాస్త్రం, దేవుడు మీద ఉరి ప్రజలకి ఉండే నమ్మకమే ఈ సినిమా కథ…
ఇక ఈరోజు రిలీజ్ అయిన ట్రైలర్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా విడుదలైంది. అందుకే శంభాలా: ఏ మిస్టికల్ వరల్డ్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి రేపుతోంది. రహస్యాలు-శాస్త్రం-అధ్యాత్మికత కలిసి సాగే వినూత్న కథ ఇది.
ట్రైలర్ మొదటి ఫ్రేమ్ నుంచే ఉత్కంఠ పెరుగుతుంది. శివుడు-అసురుడు మధ్య జరిగిన పురాణ యుద్ధ కథతో స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత ప్రస్తుత కాలాన్ని చూపిస్తూ, ఒక గ్రామంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలు మనకి కనబడతాయి.
ఈ సంఘటనల వెనుక నిజం తెలుసుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు జియో-సైంటిస్ట్ గా ఆదీ సాయి కుమార్. విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మే ఆదీ, అద్భుతాలు అనేవి లేవని నమ్ముతాడు. కానీ అక్కడ చూసే అజ్ఞాత శక్తులు, అనుభవాలు అతని లాజిక్ ని తారుమారు చేస్తాయి. “అసలు నిజం ఏమిటి?” అన్న ప్రశ్నతో కథ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
కొత్త లుక్ లో ఆదీ కనిపిస్తూ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆయన తండ్రి సాయి కుమార్ వాయిస్ ఓవర్ ట్రైలర్ కి ప్రత్యేక శక్తిని తీసుకొచ్చింది. అర్చనా అయ్యర్, స్వసికా, రవి వర్మా, మధునందన్, శివ కార్తిక్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ క్రిస్మస్—డిసెంబర్ 25న శంభాలా థియేటర్లలోకి రాబోతోంది. విజ్ఞానం vs ఆధ్యాత్మికత మధ్య జరిగే ఈ సస్పెన్స్ జర్నీ ప్రేక్షకులకు కొత్త అనుభవం ఇవ్వడం ఖాయం.