రెబల్ స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా రాజా సాబ్ సినిమా రేపే థియేటర్లలోకి రాబోతోంది. పాన్-ఇండియా కమర్షియల్ స్టార్‌గా ప్రభాస్‌కు గుర్తింపు ఉన్నప్పటికీ, ఈసారి హారర్ కామెడీ జానర్‌లోకి అడుగుపెట్టడం ట్రేడ్‌తో పాటు ప్రేక్షకులకు కూడా సర్‌ప్రైజ్‌గా మారింది. అయితే ప్రభాస్‌కు జానర్‌ను పూర్తిగా మార్చేయడం కొత్త కాదు.
ఇటీవల జరిగిన ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇదే విషయాన్ని ప్రస్తావించగా, ప్రభాస్ చాలా కూల్‌గా స్పందించాడు. 15 ఏళ్ల క్రితం కూడా తాను ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నానని చెప్పాడు.
“నా తొలి సినిమా యాక్షన్ మూవీతోనే ప్రారంభమైంది. కానీ వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ బోర్ కొట్టింది. డార్లింగ్ చేసినప్పుడు అది వర్క్ అవ్వదని చాలామంది అనుకున్నారు. కానీ ఆ సినిమా ద్వారా నేను వేరే రకమైన సినిమాలు కూడా చేయగలనని నిరూపించాను. ఇప్పుడు అదే విషయాన్ని రాజా సాబ్ తో మళ్లీ రిపీట్ చేయాలనుకుంటున్నాను,” అని ప్రభాస్ చెప్పాడు.
హారర్-కామెడీ జానర్‌కు ఫాంటసీ ఎలిమెంట్స్ జోడించి, ప్రభాస్ తొలిసారి ఈ తరహా సినిమాలో నటిస్తున్నాడు. యాక్షన్ హీరోగానే కాకుండా, జానర్ మార్చినా కూడా సక్సెస్ అవుతానని నేషనల్ ఆడియన్స్‌కు చెప్పాలనేదే ప్రభాస్ లక్ష్యం.

ప్రభాస్ ఊహిస్తున్నట్లే ఈ సినిమా సక్సెస్ అయితే, భవిష్యత్తులో మరెక్కువ స్టార్ హీరోలు action సినిమాల వెనక పరిగెత్తకుండా, కొత్త జానర్స్ ట్రై చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో దర్శకుడు మారుతి మాట్లాడుతూ, రాజా సాబ్ లో ప్రభాస్‌ను పూర్తిగా రిఫ్రెషింగ్ అవతార్‌లో చూస్తారని చెప్పారు. హారర్-ఫాంటసీ సెటప్ ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్‌కు కొత్త డైమెన్షన్ ఇచ్చిందని తెలిపారు.
సంజయ్ దత్, బోమన్ ఇరానీ లాంటి సపోర్టింగ్ క్యాస్ట్ కథకు విలనిజం తీసుకొస్తే, హీరోయిన్లు రొమాన్స్‌తో పాటు ఎమోషనల్ డెప్త్‌ను జోడిస్తారు.
జనవరి 8 నుంచి ప్రీమియర్ షోలు మొదలవుతాయని, అప్పటి ప్రేక్షకుల స్పందనలే సినిమాకు అసలైన రిజల్ట్ చెబుతాయని మారుతి చెప్పారు. రాజా సాబ్ ను “డిస్నీలా ఉండే ఫాంటసీ ఎక్స్‌పీరియన్స్”గా తీర్చిదిద్దామని, పెద్ద తెరపై పూర్తిగా ఎంజాయ్ చేయాల్సిన సినిమా ఇదని ఆయన అన్నారు.