Native Async

ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ లాక్… కాంతార తో కలసి థియేటర్స్ లో!

Prabhas’ The Raja Saab Trailer Locked for 3 Minutes 30 Seconds – To Screen with Kantara Chapter 1
Spread the love

ప్రభాస్ అభిమానులకు పండుగ వాతావరణం రాబోతుంది. అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజా సాబ్ ట్రైలర్ ఫైనల్‌గా లాక్ అయ్యింది. మొత్తం 3 నిమిషాల 30 సెకన్ల నిడివితో ఈ ట్రైలర్ వస్తోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

ఇంకా స్పెషల్ ఏంటంటే… ఈ ట్రైలర్ ని అక్టోబర్ 2న విడుదల కానున్న కాంతార చాప్టర్ 1 సినిమాతో కలిసి థియేటర్స్ లో స్క్రీన్ చేయబోతున్నారు. అంటే ఒకే రోజున రెండు పెద్ద బహుమతులు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఒకవైపు కాంతార అద్భుత అనుభూతి, మరోవైపు ప్రభాస్ కొత్త సినిమా రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ – డబుల్ ట్రీట్ అని చెప్పొచ్చు.

మరింత స్టైల్‌గా, రొమాంటిక్ టచ్ తో ప్రభాస్ కనిపించబోతున్నాడని ఇప్పటినుంచే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రభాస్ మాస్ ఇమేజ్ కి, అతని లవ్ బాయ్ చార్మ్ కి ఒక కలయికలా ఈ ట్రైలర్ ఉండబోతుందని అభిమానులు నమ్ముతున్నారు.

ఇప్పటికే అనౌన్స్ చేసినప్పటి నుంచే రాజా సాబ్ పై ఎక్స్‌పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి. ఇక ట్రైలర్ తో ఆ అంచనాలు మరింత రెట్టింపు కానున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *