రాజమౌళి వారణాసి లో ప్రకాష్ రాజ్ పాత్ర ఇదే…

Prakash Raj to Appear as a Devotee of Lord Shiva in Rajamouli’s ‘Varanasi’ with Mahesh Babu

వారణాసి… ఇప్పుడు అందరు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా లో మహేష్ బాబు రుద్రా గా, ప్రియాంక మందాకినీ గా ఇంకా ప్రిథ్వి రాజ్ విలన్ గా నటిస్తున్నారు. అలానే ఈ సినిమా ని వచ్చే ఇయర్ 7th ఏప్రిల్ న రిలీజ్ చేస్తామని ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసారు. ఇంకా చెప్పాలంటే ఏకంగా హాలీవుడ్ మీడియా కె టీం అందరు కలిసి ఇచ్చిన ఇంటర్వూస్ లో సినిమా గురించి చాల విషయాలు బయటపడ్డాయి…

అలానే ఈ భారీ చిత్రం లో తన పాత్రకు సంబంధించిన వివరాలను ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. ఈ సినిమాలో తాను పరమశివుడిపై అపార భక్తి కలిగిన శివభక్తుడిగా కనిపించనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో జార్జియాలో ప్రారంభమయ్యే తదుపరి షూటింగ్ షెడ్యూల్‌లో మహేశ్‌బాబుతో కలిసి కీలక సన్నివేశాల్లో పాల్గొనబోతున్నట్లు చెప్పారు. ప్రియాంకా చోప్రా కథానాయికగా నటిస్తున్న ఈ అడ్వెంచర్ డ్రామా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మహేశ్‌బాబు–ప్రకాశ్ రాజ్ combo కి మంచి క్రేజ్ ఉండగా, ఈ చిత్రం ద్వారా మరోసారి ఆ మ్యాజిక్ వెండితెరపై కనిపించనుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *