Native Async

ఆమ్మో ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ డేట్ డిలే వెనుక ఇంత కథ ఉందా???

Spread the love

ఈ ఏడాది ప్రభాస్ నటించిన సినిమా ఏది థియేటర్స్ లోకి రాలేదు… రాజా సాబ్ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ అన్నారు, తరువాత డిసెంబర్ అన్నారు… ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ పొంగల్ అంటున్నారు…

కానీ కాలం గడుస్తుండగానే ఈ సినిమా రిలీజ్ తారీఖు పదేపదే వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, రాజా సాబ్ వచ్చే సంవత్సరం సంక్రాంతి సందర్భంగా — అంటే 2026 జనవరి 9న — థియేటర్లలోకి రానుంది. చాలామంది ఈ ఆలస్యానికి కారణం ప్రభాస్ బిజీ షెడ్యూల్ లేదా షూటింగ్ ఇష్యూలు అనుకున్నారు. కానీ అసలు కారణం వేరే ఉందని ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ వెల్లడించారు.

అయన చెప్పిన దాని ప్రకారం, షూటింగ్ కాదు, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) విభాగమే ఈ ఆలస్యానికి ప్రధాన కారణమట. ఈ ప్రాజెక్ట్‌కి నియమించిన ఒక సీనియర్ VFX సూపర్వైజర్ నెలల తరబడి ఒక షాట్ కూడా అందించకపోవడంతో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ టైమ్‌లైన్ గందరగోళంగా మారిందట. అంతేకాదు, ఆ టెక్నీషియన్ అదే సమయంలో పుష్ప 2 లాంటి పెద్ద ప్రాజెక్ట్‌లలో కూడా పనిచేస్తుండటంతో, రాజా సాబ్ పనులు మరింత ఆలస్యమయ్యాయి.

విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం, ఆ టెక్నీషియన్‌తో సమన్వయం కూడా కష్టంగా మారిందట. ఫలితంగా అతన్ని ప్రాజెక్ట్‌ నుండి తొలగించక తప్పలేదని చెప్పారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇదే టెక్నీషియన్‌తో దర్శకుడు రాజమౌళి కూడా ఇటీవల పని నిలిపివేశారని సమాచారం. అంటే ఈ సమస్య ఒక్క ప్రాజెక్ట్‌కే పరిమితం కాలేదని తెలుస్తోంది.

తరువాత విశ్వప్రసాద్ తన ప్రొడక్షన్ కంపెనీకి ప్రత్యేకంగా ఒక ఇన్‌హౌస్ VFX టీమ్ ఏర్పాటు చేశారు. ఈ కొత్త టీమ్ మిరాయి ఇంకా రాజా సాబ్ సినిమాల పనులు పూర్తి చేసింది. మిరాయి విజువల్ ఎఫెక్ట్స్‌కి వచ్చిన ప్రశంసలతో, ఇప్పుడు రాజా సాబ్ కూడా అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుందని బృందానికి నమ్మకం కలిగింది.

ప్రభాస్ అభిమానులు కూడా ఇప్పుడు ఈ సినిమాపై మరింత ఆశలు పెట్టుకున్నారు. సో, చూద్దాం పండక్కి బొమ్మ బ్లాక్బస్టర్ ఆ కాదా అని…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *