నిన్న ప్రభాస్ రాజా సాబ్ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే కదా… ఐతే, మొదటి రోజే నెగటివ్ టాక్ తెచ్చుకుంది కాబట్టి, ఎక్కువ expect చేయలేము… కానీ ఫస్ట్ డే కలెక్షన్స్ 100 కోట్లు దాటేసింది. ఇక ఈరోజు హైదరాబాద్ లో రాజా సాబ్ సక్సెస్ మీట్ జరిగింది…
ఆ సక్సెస్ మీట్ మారుతి మాట్లాడుతూ, ఫస్ట్ ఫాన్స్ కి సారీ చెప్పాడు… ఇంకా మాట్లాడుతూ…
‘‘తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో షో సరైన సమయంలో పడలేదు. చాలా మంది ఇబ్బంది పడ్డారు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక మిడ్ రేంజ్ దర్శకుడు ప్రభాస్ సినిమా తీశాడనిపించేలా ఆయన చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించాను. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్ గేమ్‌గా సాగే క్లైమాక్స్ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు అందరికీ నచ్చింది. ఇండియన్ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదని అంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది’’.
‘‘ఫలితం ఒక్క షో, ఒక్కరోజులోనే నిర్ణయించకూడదు. పదిరోజులు ఆగితే ఈ సినిమా ఏంటో తెలుస్తుంది. మూవీలోని కొత్త పాయింట్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అర్థం కానీ, వాళ్లు తిడుతున్నారు. దయచేసి ఫలితాన్ని అప్పుడే నిర్ణయించొద్దు. ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్, పోస్టర్స్‌లో చూపించాం. సినిమాలో కనిపించకపోవడంతో అభిమానులు చాలా మంది సినిమాను ఎంజాయ్ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్ ఉన్న సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. సెకండ్ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్ చేస్తున్నాం. వాటికి సెన్సార్ కూడా పూర్తయింది. ఆ సన్నివేశాల కోసం ప్రభాస్ కష్టపడ్డారు. మొత్తం 8 నిమిషాల సీన్స్ కొత్తగా యాడ్ అవుతాయి’’.
‘‘ఈ సంక్రాంతికి అన్నీ సినిమాలు హిట్ కావాలని కోరుకుంటున్నా. సినిమా ఫలితం గురించి బాధపడిపోతున్నానని చాలా మంది ఫోన్ చేశారు. కొత్త పాయింట్ చెప్పినప్పుడు ప్రేక్షకులు స్వీకరించడానికి సమయం పడుతుంది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండండి. పండగకు ముందే మీకు పెద్దాయన (ప్రభాస్ ఓల్డ్‌లుక్)ను తీసుకొస్తున్నాం. నాకు ధైర్యం చెప్పిన ప్రతి స్నేహితుడికి థ్యాంక్స్. సోమవారం నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయి’’ అని మారుతి తెలిపారు.