మహేష్ బాబు – రాజమౌళి… SSMB 29 సినిమా ఈ మధ్య ఫుల్ ట్రేండింగ్ లో ఉంది… ఇంట బయట ఎక్కడ ఉన్న ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు… అలానే టీం కూడా అంతే surprising గా ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ఇంకా ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ చేసింది… ఇక #GlobeTrotter టైటిల్ ఇంకా గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతోంది అన్న సంగతి తెలిసిందే.

అయితే ఇటీవల జరిగిన భారీ గథెరింగ్ ప్రమాదాల నేపథ్యంలో అభిమానుల్లో కొంత ఆందోళన వ్యక్తమైంది. దాంతో టీమ్ సేఫ్టీకి సంబంధించిన పలు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది.

ఇక రాజమౌళి స్వయంగా వీడియో ద్వారా అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. ఆయన చెప్పారు — “ఈవెంట్ కోసం అందరూ ఎంత ఎగ్జైటెడ్‌గా ఉన్నారో నాకు తెలుసు. నేనూ అంతే ఉత్సాహంగా ఉన్నాను. కానీ మనందరం సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి. పోలీస్ శాఖ కఠినమైన ఆదేశాలు ఇచ్చింది, వాటిని తప్పక పాటించాలి” అన్నారు.
ఈ ఈవెంట్ పూర్తిగా పాస్ ఉన్న వారికే అని స్పష్టం చేశారు. పాస్ లేకుండా ఎవరినీ అనుమతించరని చెప్పారు. అలాగే 18 ఏళ్ల లోపు ఉన్నవారికి, సీనియర్ సిటిజన్స్‌కి ఎంట్రీ లేదని స్పష్టంచేశారు. ఇది అభిమానుల సేఫ్టీ కోసమే తీసుకున్న నిర్ణయమని ఆయన తెలిపారు.
డ్రైవింగ్ మార్గదర్శకాలను కూడా వివరించిన రాజమౌళి చెప్పారు — “విజయవాడ–హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వారు ఆర్ఎఫ్సీ మెయిన్ గేట్‌కి ముందే ఎడమవైపు తిరిగి అనస్పూర్ రూట్లో రావాలి. ఇది ఈవెంట్ వెనుక వైపు ఉంటుంది. హైదరాబాద్ వైపు నుంచి వస్తున్న వారు ఎగ్జిట్ 11 దాటి యూ టర్న్ తీసుకొని సర్వీస్ రోడ్లో చేరి సంగీ దేవాలయ రూట్ ద్వారా రావాలి. గచ్చిబౌలి వైపు నుంచి వస్తున్న వారు ఎగ్జిట్ 12 తీసుకొని అదే సంగీ రూట్లో రావచ్చు” అన్నారు.
ఇంకా — “పాస్‌లపై ఉన్న క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీకు వీడియో మార్గదర్శకాలు వస్తాయి. వాటిని డౌన్లోడ్ చేసుకొని సూచనలు పాటించండి. సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేశాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి గేట్లు తెరుస్తాం. ముందుగా వస్తే మంచి పార్కింగ్ స్పేస్, మంచి సీట్లు కూడా దొరుకుతాయి. పోలీస్ అనుమతులు చాలా కఠినంగా ఉన్నాయి. చిన్న పిల్లలు, వృద్ధులు ఇంట్లోనే ఉండి లైవ్‌లో చూడండి. జియో హాట్‌స్టార్‌లో ఈవెంట్ ప్రసారం అవుతుంది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఈవెంట్ రద్దు చేస్తామని పోలీసులు చెప్పారు. ఇది అంతా మన భద్రత కోసం కాబట్టి అందరం సహకరించాలి. మన ఈవెంట్ సేఫ్‌గా, సక్సెస్‌గా జరగాలి” అని రాజమౌళి తెలిపారు.
మొత్తానికి రాజమౌళి తీసుకున్న ఈ ముందస్తు జాగ్రత్తలు, మహేష్ బాబు అభిమానుల్లో భరోసా నింపాయి. నవంబర్ 15న జరగబోయే ఈ ఈవెంట్ ఇప్పుడు మరింత అంచనాలను రేపుతోంది.