అంచనాలను రెట్టింపు చేసిన ‘రాకాస’ ట్రైలర్

Rakasa Trailer Out: Sangeeth Shobhan’s Horror Thriller Raises Expectations Ahead of April 3 Release

మానస శర్మ దర్శకత్వం వహించిన రాకాస సినిమాలో సంగీత్ శోభన్ హీరోగా, నయన్ సారిక హీరోయిన్‌గా నటించారు. ఇక భిన్నమైన కథతో రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించాయి. డిఫరెంట్ ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమాపై మంచి బజ్ కూడా ఏర్పడింది. తాజాగా మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ ఆ అంచనాలను మరింతగా పెంచింది.

కొత్తగా వచ్చిన ట్రైలర్ ప్రారంభం నుంచే ఆసక్తిని కలిగిస్తుంది. “ఆ కోటలో ఉన్నది… ఊరు బలి పంపుతున్నది సామాన్యుడికి కాదు… భీకర బ్రహ్మ రాక్షసుడికి” అనే డైలాగ్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ వెంటనే కనిపించే పురాతన కోట, ఆ కోటలో దాగి ఉన్న రహస్యాలు సినిమా కథపై మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి. భయంతో నడుస్తున్న గెటప్ శీను ఒక చిన్నారి చేసిన బూర శబ్దానికి కూడా జడుసుకోవడం ట్రైలర్‌లో ఫన్నీగా చూపించారు. వెంటనే అతను “నువ్వు పెద్ద డీఎస్పీ అనుకుంటున్నావా? లోపలికి పో… కోతి నాయాలా!” అని తిడుతూ చెప్పే డైలాగ్ నవ్వులు పూయిస్తుంది.

హీరో సంగీత్ శోభన్ మరియు హీరోయిన్ నయన్ సారిక మధ్య ఉన్న ప్రేమ కథను కూడా ట్రైలర్‌లో చూపించారు. వారి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు కథలో లవ్ యాంగిల్‌ను తెలియజేస్తాయి. అలాగే బస్సులో సంగీత్, తానికెళ్ల భరణి, గెటప్ శీను మధ్య వచ్చే కామెడీ సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఒక పోలీస్ ఆఫీసర్ సంగీత్‌ను “రాత్రి ఏం జరిగింది?” అని అడిగితే, అతను “పడుకోవడం లేటయ్యింది” అని సరదాగా చెప్పడం నవ్వులు తెప్పిస్తుంది.

అలాగే బ్రహ్మాజీ పాత్ర కూడా ట్రైలర్‌లో ప్రత్యేకంగా కనిపిస్తుంది. “వేళాకోళంగా ఉందా? నా హిస్టరీ నీకు తెలియదు” అని బ్రహ్మాజీ చెప్పగా, సంగీత్ “ఏం డిలీట్ చేస్తారా?” అని ఇచ్చే కౌంటర్ డైలాగ్ కూడా వినోదాన్ని పెంచుతుంది. ఈ సరదా సంభాషణల మధ్యలోనే కథలోని మిస్టరీ ఎలిమెంట్స్‌ను చూపించడం ట్రైలర్ ప్రత్యేకతగా నిలిచింది.

ట్రైలర్‌లో హీరో “ఊరుకొచ్చినప్పటి నుంచి నా జీవితం ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు” అని చెప్పే డైలాగ్ కథలో ఉన్న టెన్షన్‌ను తెలియజేస్తుంది. అదే సమయంలో ఆకాశంలో ఉల్క పడటం, రాత్రికి రాత్రే పశువులు మృతదేహాలుగా మారిపోవడం వంటి సన్నివేశాలు ఊర్లో ఏదో భయంకరమైన విషయం జరుగుతోందని సూచిస్తున్నాయి.

ఇంకా గ్రామస్తులు “ఊరు బతికి బయటపడాలంటే బలి పంపాల్సిందే” అని చెప్పే డైలాగ్ కథలోని ప్రధాన కాన్సెప్ట్‌ను చూపిస్తుంది. తానికెళ్ల భరణి ఒక పాత తాళం చెవిని చూపించడం, ఆ కోటకు గ్రామంతో ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నట్లు కనిపిస్తుంది. దీంతో ఆ కోటలో ఏ రహస్యాలు దాగి ఉన్నాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది.

ట్రైలర్ చివర్లో “ఈమాత్రం దానికేనా… లోపల నీకుంటది అసలైన మ్యూజిక్” అనే డైలాగ్ వినిపించగా, హీరో సంగీత్ శోభన్ ఆ భయంకరమైన కోటలోకి అడుగుపెడతాడు. అక్కడ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని తెలుస్తుంది. ఆ కోటలోకి వెళ్లిన తర్వాత హీరో ఏమి చేశాడు? గ్రామాన్ని కాపాడగలిగాడా? తన ప్రేమను గెలిపించుకున్నాడా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మాత్రం ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘రాకాస’ సినిమాను చూడాల్సిందే.

మొత్తంగా చూస్తే ట్రైలర్‌లో హారర్, కామెడీ, ప్రేమ కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వబోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *