సహనం కోల్పోయిన రామ్ చరణ్ తేజ్…

Ram Charan Loses Cool as Unruly Fans Create Chaos Outside Apollo Hospital

మెగా ఇంట్లో డబల్ ఆనందం గురించి మన అందరికి తెలిసిందే… రామ్ చరణ్ ఉపాసన నిన్న రాత్రి ట్విన్స్ కి జన్మనిచ్చారు… ఈ ఆనందమైన క్షణాన ఇటు చిరంజీవి, అటు ఫాన్స్ అందరు డబల్ హ్యాపీ! కానీ ఇక్కడ ఒక చిన్న విన్నపం… వారి ఫామిలీ కి ప్రైవసీ ఇవ్వాలి కదా… చిరు ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి, డాక్టర్స్ ఇంకా హాస్పిటల్ వారితో కలిసి ఫాన్స్ కి గుడ్ న్యూస్ షేర్ చేసారు. సో, ఆ హాస్పిటల్ వద్ద చాల మంది ఫాన్స్ గుమిగూడారు… కానీ ఎప్పుడైతే చరణ్ తన కూతురు క్లిన్ కార తో కార్ దిగారో అక్కడే ఫాన్స్ మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడ్డారు!

అభిమానం అతి అయినప్పుడు అది అభిమానంగా కాకుండా ఇబ్బంది గా మారుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీలు ప్రజల మధ్యకు వచ్చినప్పుడు ఈ పరిస్థితిని తరచూ ఎదుర్కొంటుంటారు. కనీస బాధ్యత లేకుండా అభిమానులు గుంపులుగా చేరి, వారిని చుట్టుముట్టడం వల్ల అసౌకర్యకరమైన పరిస్థితులు ఏర్పడతాయి.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కవల పిల్లలు, భార్య ఉపాసనను చూసేందుకు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో అదుపు తప్పిన అభిమానుల ప్రేమ వల్ల చరణ్ తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు.

కవల పిల్లలు పుట్టిన శుభవార్త వెలువడిన వెంటనే, ఉదయం నుంచే అపోలో ఆసుపత్రి వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. రామ్ చరణ్ తన రెండేళ్ల కూతురు క్లిన్ కారాతో కలిసి ఆసుపత్రికి రాగానే, అభిమానులు ఒక్కసారిగా అతని వాహనం వైపు దూసుకెళ్లారు. వారు వాహనాన్ని చుట్టుముట్టి, సెల్ఫీలు తీసుకోవాలనే ఆతృతలో గందరగోళం సృష్టించారు.

ఆసుపత్రిలోకి వెళ్లేందుకు దారి ఇవ్వాలని రామ్ చరణ్ స్వయంగా అభ్యర్థించినా, అభిమానులు వినిపించుకోలేదు. తోసుకుంటూ, ముందుకు నెట్టుకుంటూ మరింత హడావిడి చేశారు. ఈ గందరగోళంలో సాధారణంగా ఎంతో సహనంగా ఉండే రామ్ చరణ్ కూడా తన సహనం కోల్పోయినట్టు కనిపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారి క్లిన్ కారా చరణ్ వెంట ఉన్నప్పటికీ, అభిమానులు కనీస జాగ్రత్తలు పాటించకపోవడం, ఆసుపత్రి వాతావరణాన్ని గందరగోళంగా మార్చడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

శనివారం రాత్రి రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టిన విషయం తెలిసిన వెంటనే మెగా ఫ్యాన్స్ ఆనందం హద్దులు దాటింది. ఈ సంతోషం శుభాకాంక్షలు, అభినందనల వరకే పరిమితం కాలేదు. కొంతమంది అభిమానులు హద్దులు దాటి ప్రవర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *