మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న గ్రామీణ నేపథ్య సినిమా ‘పెద్ది’. మొత్తం విల్లగె స్టైల్ లో అది కూడా విల్లగె స్పోర్ట్స్ కాన్సెప్ట్ ఉండే ఈ సినిమా ఫస్ట్ డే నుంచి మంచి బజ్ ఉంది. దర్శకుడు బుచ్చి బాబు కథ పై ఉన్న నమ్మకం, సినిమా జానర్… అంతా కలిసి ఈ మూవీకి భారీ హైప్ తీసుకొచ్చాయి.
ఇప్పుడీ మూవీ ఫస్ట్ సాంగ్ “చికిరి చికిరి” కోసం కూడా టీమ్ మరో సూపర్ ఐడియా తో వచ్చింది. సాంగ్ రిలీజ్ కి ముందు, బుచ్చి బాబు ఇంకా మ్యూజిక్ బాస్ ఏ.ఆర్. రెహ్మాన్ మధ్య జరిగిన డిస్కషన్ వీడియోను రిలీజ్ చేశారు. రెహ్మాన్ స్టూడియోలో ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ… మొదట ఈ కోలాబరేషన్ ఎలా మొదలైందో, ‘బొంబాయి’ మూవీ నుంచే రెహ్మాన్ సంగీతానికి ఎలా అభిమానిగా మారాడో బుచ్చి బాబు భావోద్వేగంగా చెప్పిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఆ తర్వాత చూపించిన ‘చికిరి చికిరి’ ప్రొమో? వావ్! రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ మూవ్స్, గ్రామ వాతావరణం, రెహ్మాన్ గారి మాయమంత్రమైన ట్యూన్… ఒక్క క్షణంలో మనసు దోచేసాయి. సాఫ్ట్ మెలొడీ, fresh visuals… చరణ్ చిరునవ్వు, అడుగు పెట్టిన ప్రతీ క్షణం ఫ్యాన్స్ ని పుల్ చేస్తుంది.
ఇది రెహ్మాన్ తన సినిమా కోసం షూట్ చేసిన మొదటి ప్రమోషనల్ వీడియో. దాదాపు దశాబ్దం తర్వాత ఆయన తిరిగి తెలుగు సినిమాకి రావడం తో … excitement కూడా పీక్ లో ఉంది.
పెద్దిలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో, జాన్వీ కపూర్ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ చిత్రం మార్చి 26న విడుదల కానుంది.