Native Async

రామ్ చరణ్ పెద్ది షూటింగ్ అప్డేట్

Ram Charan’s Peddi Gears Up for Intense New Schedule; Makers Reaffirm March 27, 2026 Release
Spread the love

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ 2026లో విడుదల కావాల్సిన అత్యంత ఆసక్తికరమైన సినిమాల్లో ఒకటిగా మారింది. ఉప్పెన తో బ్లాక్‌బస్టర్ డెబ్యూ ఇచ్చిన బుచ్చి బాబు సనా ఈసారి మరింత రా అండ్ రిస్టిక్ స్పోర్ట్స్ డ్రామా తో మనముందుకు రాబోతున్నాడు!

ఫస్ట్ గ్లింప్స్ నుంచి ఫస్ట్ సింగిల్ వరకు… పెద్ది ఇరగొట్టేసింది! వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అన్ని భాషల్లో భారీ హైప్‌ను తెచ్చుకుంది.

ఇక సినిమా టీం రేపటి నుంచి ఇంటెన్స్ షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభిస్తోంది.
హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో హీరో–హీరోయిన్‌తో పాటు కీలక నటులపై కొన్ని ముఖ్యమైన ఎపిసోడ్‌లు చిత్రీకరించబోతున్నారు. 2026 జనవరి చివరికి మొత్తం టాకీ పార్ట్‌ను పూర్తి చేసేలా స్కెచ్ వేసుకున్నారు. ఇంత పర్ఫెక్ట్ ప్లానింగ్ చూస్తే… ఈ ప్రాజెక్ట్‌ను ఎంతటి శ్రద్ధతో, ఎంతటి అంబిషన్‌తో తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది.

షూటింగ్‌తో పాటు పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ కూడా సమాంతరంగా జరుగుతున్నాయి.
మేకర్స్ మరోసారి క్లారిటీ ఇస్తూ… “పెద్ది మార్చి 27, 2026న ఎలాంటి మార్పు లేకుండా థియేటర్లలోకి వస్తుంది” అని ధృవీకరించారు.

ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన తొలిసారిగా జాన్వి కపూర్ నటిస్తోంది.
అలాగే శివరాజకుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit