పెద్ది… మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బుచ్చి బాబు ల ఈ సినిమా కోసం చాల వెయిటింగ్ కదా. ఐతే ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంది అని లాస్ట్ ఇయర్ ఏ అనౌన్స్ చేసారు కదా. అలానే నెక్స్ట్ మంత్ మార్చ్ 27th న ఈ సినిమా రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నాం కదా. కానీ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ డిలే వల్ల ఈ సినిమా ని వన్ మంత్ పోస్టుపోన్ చేసారు.
ఈ న్యూస్ ఇందాకే డైరెక్టర్ బుచ్చి బాబు సనా ట్విట్టర్ లో అనౌన్స్ చేసి, మెగా ఫాన్స్ ని ఖుష్ చేసారు. Actually ఈ సినిమా ఏప్రిల్ లోనే రావడం మంచిది. ఎందుకు అంటే, మార్చ్ 19th న రణవీర్ సింగ్ ధురంధర్ సీక్వెల్ రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే కదా. ఇంకా ఇప్పటికి థియేటర్స్ లో నడుస్తుంది. అలానే OTT లో కూడా దుమ్ము రేపుతోంది. ఫస్ట్ పార్ట్ ఓన్లీ హిందీ లోనే రిలీజ్ అయ్యింది… అప్పటికే 1400 కోట్లు కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు సీక్వెల్ హిందీ తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ ఇంకా మలయాళం లోను రిలీజ్ అవుతుంది. ఇంకా టీజర్ కూడా దుమ్ము రేపుతోంది. సో, బొమ్మ బ్లాక్బస్టర్ అని అందరు ఫిక్స్ అయ్యారు.
ఇంకా యాష్ టాక్సిక్ కూడా అదే డేట్ కి రిలీజ్ అవుతుంది. సో, రెండు సినిమాల ముందు ఎందుకు రావడం… సినిమా ఎంత బాగున్నా కలెక్షన్స్ డివైడ్ అవుతాయి కదా. సో, పెద్ది ఇప్పుడు ఏప్రిల్ 30 న రిలీజ్ అవుతుంది. ఈ న్యూస్ సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్ అవ్వడం తో పాటు, హమ్మయ్య మన పెద్ది సినిమా సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంది అని ఫాన్స్ ఖుష్ అవుతున్నారు!