టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఎనర్జీ మనందరికీ తెలిసిందే… అలాగే డాన్స్ కూడా చాల బాగా చేస్తాడు. కానీ ఎందుకో లాస్ట్ రెండు సినిమాలు ఆడలేదు. కానీ ఇప్పుడు మళ్ళి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇవ్వాలని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే కొత్త కాన్సెప్ట్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా లో స్టార్ హీరో ఉపేంద్ర ఫ్యాన్ గా నటిస్తున్నాడు… అలానే ఒక హీరో ఫ్యాన్ హీరో ని ఎంతలా ప్రేమిస్తాడో, అయన కోసం ఎంతలా కష్టపడతాడో చూపిస్తాడట సినిమాలో…
రిలీజ్ డేట్ దెగ్గరపడుతుంది కాబట్టి, సినిమా నుంచి మరో మెలోడియస్ సాంగ్, “చిన్ని గుండెలో…” లిరికల్ వీడియో రిలీజ్ చేసారు…
ఆ సాంగ్ లో బీచ్ లో రామ్–భాగ్యశ్రీ బోర్స్ ఒకరిని ఒకరు చూసుకుంటూ, కాలం అక్కడే నిలిచిపోయినట్టుగా… చల్లని గాలి, అలల శబ్దం… పక్కనే మెరిసే సముద్రం — అంతా కలసి ఒక కలల ప్రపంచం లా సూపర్ గా ఉంది…
వైవేక్ & మర్విన్ ఇచ్చిన మ్యూజిక్, కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్… రామ్ & భాగ్యశ్రీ కెమిస్ట్రీ ని ట్రెండ్ చేసేశాయి…
మీరు ఆ వీడియో చూసేయండి మరి…
మర్చిపోకండి… ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ — నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది…