రష్మిక మందన్న… ప్రస్తుతం ఈ హీరోయిన్ ఒక వైపు తెలుగు, ఇంకో వైపు హిందీ ఇంకా తమిళ్ ఇలా అన్ని ఇండస్ట్రీస్ లో సినిమాలు చేస్తుంది, హిట్స్ కూడా కొడుతోంది… లేటెస్ట్ గా ‘ది గర్ల్‌ఫ్రెండ్ అనే సినిమా తో మనముందుకు రాబోతుంది. గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రీలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా ఐదు భాషల్లో ఒకేసారి విడుదల కావడం ప్రత్యేకం.
ఇప్పటికే రెండు చార్ట్‌బస్టర్ సాంగ్స్ తో మ్యూజిక్ ట్రాక్ సూపర్ హిట్ అయిన ఈ చిత్ర యూనిట్… ఇప్పుడు మూడో సోలో ‘లాయీ లే’ ను రిలీజ్ చేసింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన స్వరాలు, కపిల్ కపిలన్ గారి హత్తుకునే వాయిస్ ఈ పాటకు ప్రాణం పోశాయి.
ఈ సినిమాలో రష్మిక మందన్నా – దీక్షిత్ శెట్టి మధ్య కనిపించే నేచురల్ కెమిస్ట్రీ… ప్రేమలోని నిశ్శబ్దం ఎంత బలంగా మాట్లాడుతుందో చూపించేలా ఈ సినిమా ట్రాక్ కనిపిస్తోంది.
ఈ ప్రేమకథకి దర్శకత్వం వహిస్తున్నది ‘చి లా సౌ’, ‘మన్మధుడు 2’ తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్.
పాటలు, విజువల్స్… అన్నీ కలిపి చూస్తే ‘ది గర్ల్‌ఫ్రెండ్’ మనసుల్ని తాకే ప్రేమకథగా కనపడుతోంది. నవంబర్ 7ను ప్రేక్షకులు ఎప్పటిలాగే ప్రేమతో ఎదురుచూస్తున్నారు.