రష్మిక మందన్న… ఇప్పుడు ఎక్కడ చుసిన తన పేరే వినిపిస్తుంది. మొన్నే కదా హిందీ లో కూడా తమ్మ సినిమా తో హిట్ కొట్టింది! ఒక వైపు తెలుగు, ఇంకో వైపు హిందీ, కుదిరినపుడల్లా తమిళ్ సినిమాలు కూడా చేస్తుంది… ఇంకేం కావలి???
ఐతే ప్రస్తుతానికి తన లేటెస్ట్ మూవీ ‘ది గర్ల్ ఫ్రెండ్’ ట్రైలర్ లాంచ్ చేసారు… ఈ ట్రైలర్ లో రొమాన్స్, భావోద్వేగం, గందరగోళం, సంఘర్షణలతో నిండిన ఆధునిక ప్రేమకథను చూపిస్తుంది.
ట్రైలర్ స్టార్టింగ్ లోనే రష్మిక తన బాయ్ ఫ్రెండ్ తో నాకు కొంచం బ్రేక్ కావలి అని అడుగుతుంది… అలానే ఆ రేలషన్ షిప్ లోని బాధ ఆమె కళ్ళల్లో కనిపిస్తుంది. ఎంత లవ్ చేస్తే మాత్రం అంత possessiveness ఉండాలా అని అనిపిస్తుంది… మొత్తానికి రష్మిక దీక్షిత్ ల కంప్లికేటెడ్ లవ్ స్టోరీ ని చూపించి excitement పెంచేశారు…
రాహుల్ రవీంద్రన్ రాసిన నిజమైన, మనసును తాకే డైలాగులు మోడరన్ లవ్ స్టోరీ బంధాల లోతులను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. రష్మిక తన సాఫ్ట్, ఎమోషనల్ పాత్రలో మెరిసిపోగా, ధీక్షిత్ శెట్టి తన ఇంటెన్స్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రావు రమేష్ తన ప్రాభావవంతమైన నటనతో కథకు మరింత బలం చేకూర్చారు.
ది గర్ల్‌ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది.