మాస్ మహారాజా రవి తేజ మళ్లీ తన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూడ్‌లోకి వచ్చేసారు… ఇటీవలి కాలంలో పలు కమర్షియల్ సబ్జెక్ట్స్‌లో నటించిన ఆయన చాల ఫ్లోప్స్ చూసాడు… అందుకే ఈసారి దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ పక్కా కుటుంబ కథా చిత్రంతో రానున్నారు.
ఈరోజే ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ఇంకా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఒక టెంపుల్ లో మాస్ మహారాజ్ ఇచ్చే ప్రకటనతో మొదలవుతుంది. అందులో రవి తేజ తన జీవితంలో ఉన్న ఇద్దరు మహిళల మధ్య ఎదుర్కొంటున్న విచిత్రమైన సమస్య గురించి చెబుతాడు. ఇద్దరూ అతనిని వేర్వేరు ప్రశ్నలు అడుగుతుంటారు… కానీ వాటికి సమాధానాలు ఎక్కడా దొరకవు. చివర్లో రవి తేజ టైటిల్ ని unveil చేస్తాడు — ‘భర్త మహాశయులకుం విజ్ఞాప్తి’.
ఈ సినిమాలో రవి తేజ రామ సత్యనారాయణ అనే పాత్రలో కనిపించబోతున్నారు. ఇద్దరు హీరోయిన్స్ మధ్య ఇరుక్కుపోయిన భర్తగా ఆయన చక్కగా నటించారు. ఆయన నేచురల్ టైమింగ్, ఎఫర్ట్‌లెస్ యాక్టింగ్ కథకు బలాన్ని తెచ్చాయి. హీరోయిన్‌లుగా ఆశికా రంగనాథ్ ఇంకా డింపుల్ హయాతీ పరిచయం అయ్యారు.
మొత్తంగా, ఈ నవ్వులు పూయించే టైటిల్ గ్లింప్స్‌తో పాటు మేకర్స్ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు. సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, మాస్ మహారాజా అభిమానులకు పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది.