లిటిల్ హార్ట్స్… అసలు ఈ బిస్కట్స్ మన అందరికి ఎంత స్పెషల్ తెలిసిందే కదా… ఆ హార్ట్ షేప్ బిస్కెట్స్, దాని పైన చెక్కెర… అబ్బో ప్రేమ లో ఉన్న వారికీ మాత్రం ఆ బిస్కెట్స్ ఇంకా స్పెషల్…
అలానే ఇప్పుడు ఆ బిస్కెట్స్ పేరు మీద వచ్చిన సినిమా ‘లిటిల్ హార్ట్స్’ కూడా అందరికి అంతే స్పెషల్ గా మారుతుంది…
ఈ చిన్న సినిమా పెద్ద హిట్ అయ్యింది మరి… ఇందాకే ఈ సినిమా ని నాని కూడా పొగిడేసాడు… ఇప్పుడు ఆ జాబితా లోకి మాస్ మహారాజ రవి తేజ కూడా చేరాడు…
రవి తేజ కూడా లిటిల్ హార్ట్స్ సినిమా చూసి ట్విట్టర్ లో తన రివ్యూ ని షేర్ చేసుకున్నాడు… “Heart, humour, and honest performances, everything at it’s best. Big congratulations to the entire team of #LittleHearts.”
ఆ పోస్ట్ కి మన లిటిల్ హార్ట్స్ హీరో మౌళి కూడా రిప్లై ఇస్తూ, అంత కంటే సంతోషంగా రవి తేజ కి థాంక్స్ చెప్పాడు… “Thank you so much సర్. You are an inspiration
My inner feeling “Ekkado na grahala movement start ayindhi roooo” Love you సర్…”.
లిటిల్ హార్ట్స్ సినిమా ని Sai మార్తాండ్ తెరకెక్కించగా, ౯౦స్ మిడిల్ క్లాస్ ఫామిలీ ని తెరకెక్కించిన Aditya హాసన్ ప్రొడ్యూస్ చేసాడు… ఈ చిన్న లవ్ స్టోరీ అందరిని మెప్పిస్తూ, వీక్ డేస్ తో కూడా మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్తుంది…