ప్రశాంత్ వర్మ… ఈ కుర్ర దర్శకుడి గురించి ఎంత చెప్పినా తక్కువే! ఆల్రెడీ మనం తేజ సజ్జ తో చేసిన ‘హను-మాన్’ సినిమా చూసాం. ఆ సినిమా బ్లాక్బస్టర్ అయిన తరువాత నెక్స్ట్ పార్ట్ ఇప్పుడా అని రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాం కదా… కానీ సీక్వెల్ లో రిషబ్ శెట్టి మెయిన్ రోల్ కాబట్టి, అయన కాంతారా ప్రీక్వెల్ సినిమా రిలీజ్ తరవాత స్టార్ట్ చేద్దాం అని ఫిక్స్ అయ్యారు…
సో, ఇప్పుడు కాంతారా రిలీజ్ అయ్యి బ్లాక్బస్టర్ కూడా అయ్యింది… కాబట్టి లైన్ క్లియర్ అయ్యింది! అందుకే ఇప్పుడు కాంతారా పనుల నుండి బయటకు వచ్చిన రిషబ్, తన తదుపరి సినిమా వైపు దృష్టి సారించనున్నాడు. అదే ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’. ఈ సినిమా పూర్తిగా హనుమంతుని కథపై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ ఈ సంవత్సరం డిసెంబర్‌లో ప్రారంభం అవుతుందంట అందుకే ప్రశాంత్ వర్మ ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతేకాక, రిషబ్ శెట్టి కూడా ప్రస్తుతం జై హనుమాన్ కంప్లీట్ అయ్యే వరకు ఇంకే ప్రాజెక్ట్స్ చేయరంట.

తాజాగా రిషబ్ శెట్టి మైసూర్ చముందేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేసి, తన తదుపరి సినిమా ‘జై హనుమాన్’ అని ప్రకటించారు. రిషబ్ కాంతారా: చాప్టర్ 2లో కూడా నటించాల్సి ఉండేది, కానీ జై హనుమాన్ అయ్యాకే ఆ సినిమా మొదలవుతుంది.
ఇంకా, రిషబ్ శెట్టి ‘ద ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ లోకూడా నటిచాల్సి ఉంది. ఇక ప్రశాంత్ వర్మకు జాంబీ రెడ్డి 2 ప్రాజెక్ట్ ఉంది కానీ ఆయన ఆ సినిమాను దర్శకత్వం వహించరు. సో, ఇప్పుడు ఇద్దరి కాన్సంట్రేషన్ అంతా జై హనుమాన్ పైనే!