రోషన్ మేక కొత్త సినిమా ‘ఏమో ఏమో ఇది’…

Roshan Meka’s Romantic Entertainer “Emo Emo Idi” Title & Promo Revealed on Valentine’s Day

రోషన్ మేక ని చూడంగానే మనకి శ్రీకాంత్ గుర్తుకు వస్తాడు కాదా… మరి తండ్రి తగ్గ తనయుడి లాగ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, మంచి characters చేస్తున్నాడు… మొన్నే ఛాంపియన్ లో ఒక ఊరి కోసం వారియర్ లాగ పోరాడి సూపర్ అనిపించాడు. ఇక ఇప్పుడు తన కొత్త సినిమా టైటిల్ ని వాలెంటైన్స్ డే సందర్బంగా రివీల్ చేసారు. ఈసారి రోషన్ ఒక అందమైన లవ్ స్టోరీ తో మన ముందుకు వస్తున్నాడు! ఆ సినిమా టైటిల్ ‘ఏమో ఏమో ఇది’… టైటిల్ తో పాటు ప్రోమో కూడా రిలీజ్ చేసి, లీడ్ characters ని ఇంట్రడ్యూస్ చేసారు…

ఆ ప్రోమో లో రోషన్ ని అభయ్ గా ఇంట్రడ్యూస్ చేసి, వాళ్ళ అమ్మ తో కలిసి ఒక కేఫ్ లో కనిపిస్తాడు… అక్కడ వాళ్ళ అమ్మ అభయ్ ని లవ్ గురించి అడిగితె, ఈ మధ్య అమ్మాయిలు బెంచింగ్, సిట్యుయేషన్షిప్ అని రకరకాలుగా ఉన్నారు అని, మంచి అమ్మాయి దొరికే వరకు వెయిట్ చేస్తా అని చెప్తాడు… అలాగే వెళ్లే ముందు ఆ కేఫ్ ఓనర్ ప్రీతి ని అపూర్వ గా పరిచయం చేసి, ఇద్దరు ఒకరినొకరు చూసే సీన్ చూపించారు… అలా ఇద్దరికీ ఫస్ట్ సైట్ లోనే ఇద్దరు నచ్చుతారు… సో, మరి ఈ లవ్ స్టోరీ ఎక్కడికి పోతుందో చూడాలి… సో, మనం శ్రీకాంత్ ఎలా లవర్ బాయ్ గా చూసామో, రోషన్ ని అలా చూస్తుంటే సూపర్ గా ఉన్నాడు!

ఈ క్యూట్ లవ్ స్టోరీ ని HIT సిరీస్ దర్శకుడు శైలేష్ కొలెను డైరెక్ట్ చేస్తుండగా, నాగ వంశి తన సితార బ్యానర్ పై నిర్మిస్తున్నాడు! అలాగే ఈ సినిమా దసరా కె థియేటర్స్ లోకి రాబోతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *