మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ACCIDENT తరవాత ఇంకా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తున్నాడు… అసలు చాల కష్టాంగా రికవరీ ఐన కానీ, దృఢ నిశ్చయం తో మళ్ళి కెమెరా ముందుకు వచ్చాడు… ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ ‘సంబరాల యేటి గట్టు’ చేస్తున్నాడు… ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 125 కొట్లాట మరి…
ఐతే మొన్నటి వరకు జరిగిన సినీ కార్మికుల స్ట్రైక్ వల్ల చాల షూటింగ్స్ కి అంతరాయం ఏర్పడింది… దాంట్లో అనిల్ రావిపూడి చిరంజీవి ల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా కావచ్చు ఇంకా బాలయ్య సినిమా కావచ్చు, అందరు ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు అంత సర్దుకుంది కాబట్టి, సినిమాలు మళ్ళి సెట్స్ పైకి వెళ్లాయి…
అలాగే సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ సినిమా SYG కూడా మళ్ళి సెట్స్ మీదకి వెళ్లనుంది… మళ్ళి ఈ నెల మధ్యలో స్టార్ట్ అవుతుంది అంట… ఇదే షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్ తో పాటు కొన్ని ఇంటెన్స్ యాక్షన్ sequences లు కూడా షూట్ చేస్తారంట అది కూడా పీటర్ హెయిన్స్ అద్వర్యం లో. దీంట్లో బాలీవుడ్ విలన్ తో పాటు కొంత మంది ఫారెన్ ఫైటర్స్ తో కూడా మన తేజ్ పోరాడతారంట…
అలాగే ఈ సినిమా CGI వర్క్ కూడా పెండింగ్ ఉండడం తో దాని మీద కూడా కొత్త ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారంట నిర్మాతలు… ఈ సినిమా లో తేజ్ తో పాటు ఐశ్వర్య లక్ష్మి, జగపతి బాబు, శ్రీకాంత్, సాయికుమార్, అనన్య నాగళ్ళ ఇంకా రవి కృష్ణ ముఖ్య పత్రాలు చేస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ డేట్ త్వరలో అనౌన్స్ చేస్తారంట…