సాయి పల్లవి… నాగా చైతన్యతో కలిసి నటించిన బ్లాక్‌బస్టర్ ‘తండేల్’ తర్వాత లాస్ట్ ఇయర్ తన సినిమాలేవీ కనిపించలేదు… కానీ ఇప్పుడు 2026ని చాలా అంబిషియస్‌గా ప్లాన్ చేసుకుంటోంది. ఒకేసారి రెండు భారీ బాలీవుడ్ సినిమాలతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది.
రన్బీర్ కపూర్ నటిస్తున్న మైథలాజికల్ స్పెక్టకిల్ ‘రామాయణం’ లో సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తున్న సంగతి ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఆ సినిమాకు ముందే ఆమె బాలీవుడ్ డెబ్యూ మరో సినిమాతో జరగబోతోంది. అదే ‘Mere Raho’. జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ సినిమా అవ్వనుంది.

మొదటిగా ఈ సినిమా ని ఏప్రిల్ 24న వేసవి స్పెషల్‌గా విడుదల చేయాలని భావించిన Mere Raho… ఇప్పుడు జూలై 2026కి వాయిదా పడే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేకపోయినా… ఏప్రిల్ 17న విడుదలకు సిద్ధమవుతున్న సల్మాన్ ఖాన్ భారీ చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ తో క్లాష్ తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం.
ఇక ఏప్రిల్, మే నెలల్లో ఇప్పటికే పలు ప్రముఖ సినిమాలు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో… Mere Raho కి సరైన సోలో రిలీజ్ విండో దొరకడం కష్టంగా మారిందని తెలుస్తోంది. అందుకే జూలై నెలను ఎంచుకునే ఆలోచనలో నిర్మాతలు ఉన్నారని టాక్.

ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం… 2011లో వచ్చిన కొరియన్ సినిమా ‘వన్ డే’కి రీమేక్‌గా తెరకెక్కుతోంది. ఒక అందమైన ప్రేమకథగా రూపొందుతున్న Mere Raho… జపాన్‌లోని సప్పొరో నగరంలో జరిగిన స్నో ఫెస్టివల్ సమయంలో షూట్ కావడంతో విజువల్‌గా కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.