సమంత… ఐటీ క్లాసి లుక్ లో చాల బాగుంటుంది… ఇంకా మోడరన్ లుక్ లో అదరగోతుంది. ఆల్రెడీ సమంత యాక్షన్ మోడ్ ని మనం యూ-టర్న్, ఫామిలీ మం వెబ్ సిరీస్ లో చూసాం. ఇక ఇప్పుడు సమంత సొంత ప్రొడక్షన్ లో నందిని రెడ్డి డైరెక్షన్లో చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా చేస్తుంది…
చాలాకాలం వెండితెరకి దూరంగా ఉన్న సమంత… ఇప్పుడు మళ్లీ తనదైన స్టైల్లో గట్టిగా తిరిగి రావడానికి సిద్ధమవుతోంది. ఆమె కమ్‌బ్యాక్ మూవీ అని అందుకే గట్టిగా చెప్పచు. ‘మా ఇంటి బంగారం’. తాజాగా విడుదలైన టీజర్ చూస్తే… ఈ సినిమా సాధారణ కథ కాదని, సమంత పాత్రే ఈ సినిమాకు ప్రధాన బలమని స్పష్టంగా అర్థమవుతుంది. రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించకపోయినా, ముందుగానే టీజర్ రిలీజ్ చేయడం చూస్తే – మేకర్స్ కంటెంట్‌పై ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నారో చెప్పక్కర్లేదు. థియేట్రికల్, ఓటీటీ డీల్స్‌ను స్ట్రాంగ్‌గా లాక్ చేయాలనే ప్లాన్‌లో టీమ్ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక టిజర్ లో సమంత ఒక కొత్త పెళ్లైన అమ్మాయి గా కనిపిస్తుంది. భర్తకు ఇష్టం లేకపోయినా… అత్తింటికి వెళ్లాలని ఆమె నిర్ణయం తీసుకుంటుంది. మొదట్లో ఆ కుటుంబం అంతా చాలా సాధారణంగా, సంప్రదాయబద్ధంగా కనిపిస్తారు. కానీ కథ ముందుకు సాగేకొద్దీ… ఏదో తేడా ఉందన్న ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆమెను తక్కువగా అంచనా వేస్తారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఒక్కటే – ఈ అమ్మాయికి గ్యాంగ్‌స్టర్ ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఆమె అక్కడికి వచ్చినది సరదాగా కాదు… ఒక స్పష్టమైన మిషన్‌తో అని తెలిసేసరికి టిజర్ ఎండ్ అవుతుంది.
ఆ మిషన్‌లో భాగంగా సమంత చీరలోనే గూండాల తో ఫైట్ చేయడం, ఎదురొచ్చిన వారిని చంపేయడం, ఇంటిని టార్గెట్ చేసిన గ్యాంగ్‌ను తుపాకులతో కూల్చేయడం… ఇవన్నీ టీజర్లోనే షాక్ ఇచ్చేలా ఉన్నాయి. అసలు “బంగారం” ఎవరు? ఆమె వెనుక దాగున్న చీకటి నిజం ఏమిటి? ఆ గ్రామానికి ఆమెను తీసుకువచ్చిన రహస్యం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెరపైనే తెలుస్తాయన్న క్లారిటీ టీజర్ ఇస్తుంది.
కథ ఐడియా ఫ్రెష్‌గా అనిపిస్తోంది. పైకి చాలా ప్రశాంతంగా, సంప్రదాయంగా కనిపించే ఒక మహిళ… అవసరం వచ్చినప్పుడు ఎంత భయంకరంగా మారగలదో చూపించడమే ఈ పాత్ర ప్రత్యేకత. బయటికి సాఫ్ట్‌గా కనిపించి, లోపల అగ్ని పర్వతంలా ఉన్న క్యారెక్టర్స్‌ని గుర్తు చేసేలా సమంత పాత్ర డిజైన్ చేశారు.
ఎక్కువ హడావిడి లేకుండా, మోస్తరు బడ్జెట్‌తో రూపొందినప్పటికీ ‘మా ఇంటి బంగారం’ మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇది పూర్తిగా సమంతపై నడిచే సినిమా. ఆమె నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్సే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అభిమానులకు ఇది నిజంగా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫుల్ లెంగ్త్, పవర్ఫుల్ సమంత కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు.