టాలీవుడ్ నటుడు సత్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్-కామెడీ సినిమా ‘జెట్‌లీ’. రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. సత్య, మిస్ యూనివర్స్ ఇండియా రియా సింగ్‌హా లీడ్ జంటగా ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేసిన మేకర్స్… ఈరోజు సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.
ఈ గ్లింప్స్ ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతుంది. విమానంలో తీవ్ర అలజడి మధ్య సత్య గొంతుతో వేమన శతకం వినిపిస్తూ మొదలై… ఒక్కసారిగా గన్‌ఫైర్, గుర్తింపు గందరగోళం, హై-రిస్క్ పరిస్థితులతో కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. ఈ సందర్భంలో సత్య తనను తాను ‘జనరల్ కంపార్ట్‌మెంట్ హీరో’ గా పరిచయం చేసుకోవడం నవ్వులు పూయిస్తుంది.
సత్య కొత్త లాంగ్ హెయిర్ లుక్ స్టైలిష్‌గా ఉండగా, ఆయన కామెడీ టైమింగ్ మరోసారి హైలైట్‌గా నిలుస్తుంది. హీరోయిన్ రియా సింగ్‌హా గ్లామర్‌తో పాటు స్టంట్స్ చేస్తూ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్ లాంటి నటుల ఉనికి సినిమాకు అదనపు కామెడీ గ్యారంటీగా కనిపిస్తోంది.
హైజాక్ అయిన విమానంలో జరిగే కథతో, యాక్షన్‌తో పాటు అనూహ్యమైన హ్యూమర్‌ను మిక్స్ చేయడంలో రితేష్ రాణా మరోసారి తన ప్రత్యేకత చూపిస్తున్నాడు. కాల భైరవ సంగీతం, సురేష్ సరంగం సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద బలంగా నిలుస్తున్నాయి.