టాలీవుడ్ పాపులర్ హీరో సత్యదేవ్ కొత్త సినిమాను ఈరోజు ఆఫీసియల్ గా లాంచ్ అయ్యింది. ఇది ఆయన కెరీర్‌లో ఇది 15వ చిత్రం కావడం ప్రత్యేకం. ఈ సినిమాను త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మాత బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. పూర్తి వినోదాత్మక కథతో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
అలాగే ఇందులో ఫరియా అబ్దుల్లా కథానాయికగా నటిస్తోంది. బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో సినిమా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో, హీరోయిన్‌లపై క్లాప్ కొట్టి చిత్రానికి శుభారంభం చేశారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరాను స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి తొలి షాట్‌కు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, మంచి కథతో ప్రేక్షకులను అలరించే సినిమా అందించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. త్వరలోనే షూటింగ్ పూర్తి వివరాలు మరియు ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ లాంచ్ ఈవెంట్ వీడియో ని కూడా సోషల్ మీడియా లొ షేర్ చేసారు…