సంక్రాంతి కి ఎంత పెద్ద హీరోల సినిమాలు ఉన్న కానీ శర్వానంద్ సినిమా ఉంటేనే మజ… అసలు పెద్ద హీరోల సినిమాలు ఉన్నపుడు రిస్క్ ఎందుకు అంటే, లేదు నేను ఫామిలీ డ్రామా తోనే హిట్ కొడతా అంటాడు…
అందుకే చార్మింగ్ స్టార్ శర్వానంద్ మరోసారి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం ‘సామజవరగమన’ బ్లాక్‌బస్టర్ సినిమా తీసిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో కలిసి ఆయన చేస్తున్న తాజా చిత్రం ‘నారి నారి నడుమ మురారి’ సినిమా షూట్ చివరి దశలో ఉంది, ఇక రిలీజ్ విషయాన్ని కూడా మేకర్స్ అధికారికంగా ఈ పండగ రోజు ప్రకటించారు.
దీపావళి సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో శర్వానంద్ క్రీమ్ కలర్ కుర్తా, పంచెతో సింపుల్‌గా కానీ స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.
సంక్రాంతి రేసులో ఇప్పటికే భారీ సినిమాలు లైన్లో ఉన్నా, ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’ కూడా ఆ జాబితాలో చేరింది. ఇక ఈ సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పక్కా ఫెస్టివ్ ట్రీట్‌గా రాబోతోంది.