ఆహా ఇది కదా దీపావళి అంటే… ఒక్కో సినిమా నుంచి ఒక్కో పండగ అప్డేట్ వస్తుంటే, సోషల్ మీడియా లో దుమ్ము దుమారమే… ఇక నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది శర్వానంద్ గురించే! ఈసారి ఆయన డైరెక్టర్ అభిలాష్ కంకరతో కలిసి స్పోర్ట్స్ & ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేస్తున్నాడు. ఈ సినిమా జానర్‌కి పర్ఫెక్ట్‌గా సరిపోయే టైటిల్‌ను ఫిక్స్ చేసి, దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఆ ఫస్ట్ లుక్ మాత్రం ప్యూర్ ఫైర్! బైక్‌పై కూర్చొని బైకర్ లుక్‌లో కనిపించిన శర్వా స్టైలిష్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. లెదర్ జాకెట్, గ్లవ్స్, హెల్మెట్ — అన్నీ కలిపి ఆయనకు ఒక పవర్‌ఫుల్ బైకర్ వైబ్ ఇచ్చాయి. కళ్లలోని ఇంటెన్సిటీ, రెడ్ కలర్‌లో ఉన్న టైటిల్ లోగో సినిమా ఎనర్జీని, స్పోర్టీ సౌల్‌ను స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఈ సినిమా కథ 1990ల నుండి 2000ల మధ్య జరిగే సంఘటనల నేపథ్యంతో సాగుతుంది. బైక్ రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో మూడు తరాలను — ప్రేమ, అంబిషన్ కలిపే ఒక ఎమోషనల్ జర్నీగా తెరకెక్కుతోంది. దీపావళి రోజున విడుదలైన ఈ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది.