ఏంటి టైటిల్ చూసి confuse అవుతున్నారా??? అరే మళ్ళి శివాజీ ’90s మిడిల్ క్లాస్’ సినిమా గురించి మాట్లాడుతున్నారా అనుకుంటున్నారా??? కాదు ఇది వేరే సినిమా…

కానీ ఇందులో శివాజీ హీరో, లయ హీరోయిన్ ఇంకా మన బుడ్డోడు అదే ’90s మిడిల్ క్లాస్’ సినిమాలో చిన్న కొడుకు… వాడే వీళ్ళ కొడుకు! కానీ ఈ సారి సినిమా ఫామిలీ స్టోరీ తో కలిపి కొంచం క్రిమినల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుంది…
ఇందాకే ఈ సినిమా మోషన్ పోస్టర్ చూసాక మాకు ఒక క్లారిటీ వచ్చింది, అంచనాలు కూడా పెరిగాయి మరి… ఎందుకంటే ఇది కూడా ETV WIN వాళ్ళ సినిమానే మరి!
అరె సినిమా పేరేంటో తెలుసా??? ‘సాంప్రదాయినీ దుప్పిని సుద్దపూసని’… బాగుంది కదూ…