Native Async

రెడీ అయిపోండి SSMB 29 అదిరిపోయే ప్రొమోషన్స్ కి…

SS Rajamouli – Mahesh Babu’s Global Epic Reveal on November 15? Massive Event Planned in Hyderabad!
Spread the love

అబ్బా అబ్బా ఎమన్నా ప్రొమోషన్స్ ఆ… అది కూడా సినిమా టైటిల్ అనౌన్స్ చేయడానికి ముందే… జక్కన్న నీకు సాటి ఎవరు లేరయ్యా… SSMB 29 టైటిల్ ఏంటి అని అందరం బుర్రలు పాలగొట్టుకుంటున్నారు కదా. ఇంకో కొన్ని రోజులు లాగండి… ఈ నెల లోనే ఈ సినిమా టైటిల్ రివీల్ అవుతుంది.

ఎస్‌.ఎస్‌. రాజమౌళి – మహేశ్ బాబు కాంబినేషన్‌ అంటే దేశం మాత్రమే కాదు… ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది ఈ సినిమా కోసం. నెలల తరబడి విదేశాల్లో షూట్‌ జరుపుతున్న ఈ గ్లోబల్ యాక్షన్-అడ్వెంచర్‌పై ఇప్పటి వరకు ఒక్క పోస్టర్, టీజర్ కూడా రాలేదు.

కానీ ఇక వేచి చూసే రోజులు దాదాపు ముగిసినట్లే. నవంబర్‌ 15న హైదరాబాద్‌లో ఇండియా సినిమాల చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయిలో గ్రాండ్ రివీల్ ఈవెంట్ ప్లాన్ చేస్తారని టాక్‌. #Globetrotter గా, లేదా SSMB29 గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఆ రోజే విడుదల కానుంది.

అందుకే నిన్న రాత్రి… నవంబర్‌ మొదటి రోజునే మహేష్ బాబు సరదాగా రాజమౌళిని ట్యాగ్ చేస్తూ “It’s November already @ssrajamouli 👀” అంటూ సోషల్ మీడియా లో హంగామా మొదలెట్టాడు.

వెంటనే రాజమౌళి, ప్రియాంకా చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఆ చిట్ చాట్‌లో చేరడంతో ఫ్యాన్స్‌ పండగ చేసుకున్నారు. ఈ సరదా సంభాషణతో ప్రియాంకా చోప్రా హీరోయిన్‌గా, పృథ్విరాజ్ విలన్‌గా ఉన్నట్టు క్లారిటీ వచ్చింది. త్వరలోనే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్లు, తరువాత మహేష్ బాబు లుక్ బయటకు రానున్నట్టు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి.

అంతేకాదు, ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ ఫైనల్ అయిందని కూడా టాక్‌ వినిపిస్తోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్‌. నారాయణ నిర్మిస్తున్న ఈ మెగా ప్రాజెక్ట్‌కు ఎం.ఎం. కీరవాణి మ్యూజిక్ సమకూరస్తున్నారు. 120 దేశాల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. 2027 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారత సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లబోతోంది ఈ థండర్ ప్రాజెక్ట్‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🔔 Subscribe for Latest Articles
Share: FacebookX/TwitterTelegramWhatsAppLinkedInReddit