కొన్ని నెలల కింద ప్రభాస్ రాజా సాబ్ ఫస్ట్ ట్రైలర్ చుస్తే భలే అనిపించింది… మన డార్లింగ్ లో కామెడీ angle చూసి ఫాన్స్ కి ముచ్చటేసింది. అబ్బా డైరెక్టర్ మారుతి మంచి హారర్ కామెడీ సినిమా తో పాత ప్రభాస్ ని పెద్ద తెర పైన చూపించబోతున్నాడు అని ఆనందించాం కదా… కానీ నిన్న రిలీజ్ చేసిన థియేట్రికల్ ట్రైలర్ చుస్తే, ఈ సినిమా మామూల్ది కాదు, పెద్ద స్కెచ్ ఏ అని అనిపించక మానదు! సూపర్ ఉంది… మాటల్లేవ్ మాట్లాడుకోడల్లేవ్!
ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ రిలీజ్ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని క్రియేట్ చేస్తోంది. ఈ ట్రైలర్‌లో ప్రభాస్ పూర్తిగా స్పాట్‌లైట్‌ను తనవైపే తిప్పుకుంటూ, ఫన్‌తో పాటు పవర్‌ఫుల్ అవతార్‌లో మెరిసిపోతున్నారు. దర్శకుడు మారుతి ఈ సినిమాలో ప్రభాస్‌ను కామెడీ, హారర్, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ మేళవింపుతో, అభిమానులకు ఆయన పాత ‘డార్లింగ్’ ఫేజ్‌ను గుర్తు చేసేలా ప్రెజెంట్ చేశాడు.
3 నిమిషాల 10 సెకన్ల ట్రైలర్ సరదాగా, లైట్ నోట్‌తో మొదలవుతుంది. ప్రభాస్ ఎఫర్ట్‌లెస్ కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ వెంటనే ఆకట్టుకుంటాయి. ట్రైలర్ ముందుకు సాగుతున్న కొద్దీ కథ క్రమంగా డార్క్, ఇంటెన్స్ జోన్‌లోకి వెళ్లి, స్పూకీ విజువల్స్, ఫాంటసీ ఎలిమెంట్స్‌తో ఆసక్తిని పెంచుతుంది. ఈ ట్రాన్సిషన్ చాలా స్మూత్‌గా ఉండి, చివరి వరకు ప్రేక్షకులను హుక్ చేస్తుంది.
ఈ ట్రైలర్‌లో మరో పెద్ద హైలైట్ సంజయ్ దత్. ప్రభాస్ తాతగా ఆయన ఓ మిస్టీరియస్ కింగ్ పాత్రలో కనిపిస్తూ, డార్క్ పవర్స్ ఉన్న క్యారెక్టర్‌తో భయాన్ని పుట్టిస్తున్నారు. ప్రభాస్ – సంజయ్ దత్ మధ్య వచ్చే ఫేస్ ఆఫ్ సీన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ అటెన్షన్ దక్కించుకున్నాయి. ప్రభాస్ తన టైమింగ్, యాక్షన్ సీన్స్, డైలాగ్ డెలివరీ, ట్రేడ్‌మార్క్ స్వాగ్‌తో ఫన్, ఇంటెన్సిటీ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ అదరగొట్టాడు. లాస్ట్ లో ప్రభాస్ జోకర్ గా కనిపించడం, ప్రభాస్ నానమ్మ జరీనా వాహబ్ అదే గంగమ్మ ఒక సారి మాములుగా ఇంకో దెగ్గర మహా రాణి లా కనిపించడం సూపర్ గా ఉంది! ఇలా ప్రతి షార్ట్ ఊహకి అందనంత లో ఉంది!

దర్శకుడు మారుతి ప్రభాస్ నుంచి బెస్ట్ అవుట్‌పుట్ తీసుకున్నాడు. ఆయన కంఫర్ట్ జోన్‌లో ఉంచుతూ, కొత్తగా కూడా చూపించడంలో మారుతి సక్సెస్ అయ్యాడు. బలమైన VFX, పవర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అలాగే మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ నుంచి వచ్చిన మంచి సపోర్ట్‌తో ‘ది రాజా సాబ్’ ఒక గ్రాండ్ విజువల్ ట్రీట్‌గా కనిపిస్తోంది.
జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానున్న ఈ సినిమాపై ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగాయి.