టాక్సిక్ సినిమా నుంచి యష్ ఫస్ట్ లుక్ పోస్టర్…

Yash Unleashes ‘Raya’ in Toxic Teaser; “Daddy’s Home” Moment Creates Huge Buzz

రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్. కేజీఎఫ్ లాంటి సూపర్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజ్ తర్వాత యష్ చేస్తున్న సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌పై మొదటినుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే షూటింగ్ డిలేలు కారణంగా ఈ సినిమా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో యష్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేసి, అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఇందులో యష్ పాత్ర ‘రాయా’ను పరిచయం చేశారు.

పీరియాడిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్, టాక్సిక్ ప్రపంచాన్ని స్టైలిష్‌గా ఆవిష్కరిస్తుంది. టీజర్ ఆరంభంలో ఓ సమాధి స్థలంలో కొంతమంది గ్యాంగ్‌స్టర్లు హీరో తిరిగి రాబోతున్నాడని చర్చించుకుంటూ కనిపిస్తారు. అతన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్న వారికంట, సమాధి స్థలం బయట ఒక కారు ఊగిపోవడం గమనిస్తారు.

ఆ కారులోనే హీరో వచ్చాడని, ఓ మహిళతో రొమాన్స్ చేస్తూ ఉండటం చూసి గ్యాంగ్‌స్టర్లు షాక్ అవుతారు. వెంటనే ఫైట్‌కు రెడీ అవుతారు. కానీ ఊహించని విధంగా అక్కడ ఒక భారీ పేలుడు జరుగుతుంది. అందరూ చెల్లాచెదురయ్యాక, స్టైలిష్‌గా కారులో నుంచి బయటకు వచ్చిన యష్… “డాడీస్ హోమ్” అంటూ డైలాగ్ చెప్పడం టీజర్‌లో హైలైట్‌గా నిలుస్తుంది.

‘ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే, ఈ సినిమాలో ఏ సర్టిఫికేట్ వచ్చేలా బోల్డ్ కంటెంట్ ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతోంది. స్టైల్, గ్రాండ్‌నెస్, మేకింగ్ అన్ని కలిపి టీజర్ అద్భుతంగా ఉంది. ఇంత భారీ స్థాయి సినిమాను దర్శకురాలు గీతూ మోహందాస్ నుంచి ఎవరూ ఊహించకపోయినా, ఆమె అందించిన టెక్నికల్ అవుట్‌పుట్ మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

మొత్తానికి టాక్సిక్ టీజర్‌తో యష్ మరోసారి ఇండియన్ సినీ అభిమానుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడని చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *