‘What Is Koka’ కి ఆన్సర్ దొరేసేదిందోచ్…

Varun Tej Unleashes His Wildest Avatar as Korean Kanakaraju (KOKA) in VT15 Title Glimpse

ఈరోజు మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ పుట్టినరోజు సందర్భంగా, VT15 మూవీ మేకర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. అదే సమయంలో సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు – అదే ‘వాట్ ఐస్ కొక’ అంటే, కొరియన్ కనకరాజు అని అర్ధం… అదే టైటిల్ కూడా!

ఈ గ్లింప్స్‌ చూస్తే ఒక్క విషయం మాత్రం క్లియర్‌… పిచ్చెక్కిపోవాల్సిందే… గ్లింప్సె ఆరంభం నుంచే క్యూరియాసిటీ పెంచుతుంది. కొరియా లో ఒక పోలీస్ స్టేషన్ లో పోలీసులు సత్య ని కొడుతూ ఉంటారు… కానీ సత్య కి బాషా అర్ధం కాదు! సో, రితిక ఎంటర్ అయ్యి, కనకరాజు గురించి నిన్ను అడుగుతున్నారు అని చెపుతుంది! తరవాత మన కనకరాజు ఎంట్రీ ఇస్తాడు…

లుంగీ కట్టుకుని, ఛాతీపై మెరిసే త్రిశూల టాటూ, కళ్ళలో మండే ఐసీ బ్లూ ఫైర్‌తో వరుణ్‌ తేజ్‌ ఎంట్రీ ఇస్తాడు. చేతిలో కటానా స్వోర్డ్‌… ఇక అక్కడ నుంచి ఒక్కొక్కరిని పడేస్తూ, పోలీస్‌ స్క్వాడ్‌ని చీల్చిచెండాడుతూ, చివర్లో ఆ డెవిలిష్‌ గ్రిన్‌… అది చూస్తే గ్లింప్స్‌ అక్కడే ఆగిపోతుంది కానీ, ఇంపాక్ట్‌ మాత్రం గుండెల్లో నిలిచిపోతుంది.

ఈ పాత్రతో వరుణ్‌ తేజ్‌ పూర్తిగా కొత్త గా ఉన్నాడు. కనకరాజును వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత బోల్డ్‌ రీ–ఇన్వెన్షన్‌గా నిలబెట్టాయి.

దర్శకుడు మెర్లపాక గాంధీ, ఇండో–కొరియన్‌ టోన్‌లో ఈ ప్రపంచాన్ని మరింత పిచ్చెక్కించాడు. ఎగిరే గబ్బిలాలు, నిండైన చంద్రుడు, ఫ్రేమ్‌లో వినిపించే డ్రాగన్‌లాంటి హిస్‌ సౌండ్‌… ప్రతి షాట్‌ ఒక అట్మాస్ఫియర్‌ని క్రియేట్‌ చేస్తుంది.

మొత్తానికి… కొరియన్‌ కనకరాజు (KOKA) వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లో ఒక వైల్డ్‌ అండ్ బోల్డ్ సినిమా… అంటే కాదు ఈ సినిమా ఇంకో రెండు నీళ్ళల్లో అంటే సమ్మర్ లో రిలీజ్ కి రెడీ గా ఉంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *