విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ VD14పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బ్రిటిష్ వలస పాలన నేపథ్యంగా తెరకెక్కుతున్న ఒక పీరియడ్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. అందుకే ఈ సినిమా పై చాల చాల అంచనాలు ఉన్నాయ్… రీల్ రియల్ జోడి ఒకటే కాబట్టి…
తాజాగా రాధా సప్తమి సందర్బంగా VD14 నుంచి మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను రిపబ్లిక్ డే సందర్భంగా, జనవరి 26న అధికారికంగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ఒక పవర్ఫుల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. విడుదల చేసిన స్ట్రైకింగ్ పోస్టర్ సినిమాకు సంబంధించిన నేపథ్యాన్ని స్పష్టంగా చూపిస్తూ, ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ అనుభూతిని వాగ్దానం చేస్తోంది.
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత గ్రాండ్ స్కేల్లో తెరకెక్కిస్తోంది. VD14 కథ 1854 నుంచి 1878 మధ్య జరిగిన నిజమైన చారిత్రక సంఘటనల ఆధారంగా రూపొందుతోంది. బ్రిటిష్ కాలం నేపథ్యంలో సాగే ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాను పాన్-ఇండియా స్థాయిలో భారీగా రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది మరో ప్రత్యేకమైన సినిమా కావడంతో, అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.