అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాలా??? “మీసాల పిల్ల…” సాంగ్ చాలదు ఆ సినిమా గురించి చెప్పడానికి??? ఐతే ఈ సినిమా కి సంబంధించిన ఒక గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుండి, అందరి దృష్టి దానిపైనే ఉంది.
ఆ చిన్న వీడియోలో ఒక సర్ప్రైజ్ ఉంది — అది విక్టరీ వెంకటేశ్ వాయిస్ ఓవర్! ఆ గ్లింప్స్‌తోనే ఆయన సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారని క్లియర్ అయింది. అంతవరకు ఆయన పాత్రను గోప్యంగా ఉంచిన చిత్ర బృందం, ఇప్పుడు ఆ సీక్రెట్‌ను బయట పెట్టింది.
తాజా సమాచారం ప్రకారం, వెంకటేశ్ అక్టోబర్ 21న అధికారికంగా షూట్‌లో జాయిన్ అయ్యారు. చిరంజీవి తో కలిసి ఆయన సన్నివేశాల చిత్రీకరణ మొదలైంది. ఈ సందర్భంగా వెంకటేశ్ ఎంట్రీని సెలబ్రేట్ చేస్తూ ఒక చిన్న వీడియోను త్వరలో మేకర్స్ విడుదల చేయబోతున్నారు.

వెంకటేశ్ ఈ సినిమాలో ఎక్స్టెండెడ్ కామియో రోల్ లో కనిపించనున్నారు. ఆయనకు సంబంధించిన టాకీ సీన్స్ తో పాటు చిరంజీవి, వెంకటేశ్ ఇద్దరూ కలిసి కనిపించే ఒక పాట కూడా ప్లాన్‌లో ఉందట. ఇది ఇద్దరు స్టార్‌ల ఫ్యాన్స్‌కు ఒక ట్రీట్ లాంటిదే.
అనిల్ రావిపూడి – వెంకటేశ్ కాంబినేషన్ ఇప్పటికే మూడు హిట్ సినిమాలు ఇచ్చింది. ఇప్పుడు నాలుగోసారి కలసి పనిచేయడం టాలీవుడ్‌లో మరింత హైప్ తెచ్చింది. మరోవైపు వెంకటేశ్ తన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించారు. ఈ ఏడాది ఆయన రెండు ప్రాజెక్టులను సిమల్టేనియస్‌గా షూట్ చేయబోతున్నారు.
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి 2026 సందర్భంగా, జనవరి 12న విడుదల చేసే అవకాశం ఉంది.