ఈ ఏడాది మన విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ లో వెంకీ మామ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా… అందుకే ఈ పుట్టిన రోజు నాడు సినిమా నుంచి వెంకటేష్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేయడంతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ స్పెషల్ వీడియో అసలు సూపర్ గా ఉంది…
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ ఎంట్రీ నిజంగా అద్భుతంగా ఉంది ఇంకా చెప్పాలంటే క్లాసీగా, స్టైలిష్‌గా కనిపిస్తోంది. ఇంకా వెంకటేష్‌లో పవర్, అథారిటీ స్పష్టంగా కనిపిస్తోంది.
హెలికాప్టర్ బ్యాక్‌డ్రాప్, చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా సిబ్బంది ఉండటం చూస్తే… ఆయన పాత్ర సింపుల్ డి కాదని అర్థమవుతోంది.
ఈ సినిమాలో ఇద్దరు పెద్ద సూపర్ స్టార్లు ఒకే స్క్రీన్‌పై కనిపించబోతుండటంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవు. దర్శకుడు అనిల్ రావిపూడి వెంకటేష్ కోసం ఒక పవర్‌ఫుల్, ఇంపాక్ట్‌ఫుల్ పాత్రను డిజైన్ చేశారని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది. ముఖ్యంగా, వెంకటేష్ సుమారు 20 నిమిషాల పాటు కీలక పాత్రలో కనిపించనున్నారు అన్న విషయం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్‌ను ఈరోజే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇప్పటికే అందరికీ తెలిసినట్టే, ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైల్, స్టార్డమ్, సర్ప్రైజ్… అన్నీ కలిసిన ఈ అప్‌డేట్‌తో ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై క్రేజ్ మరింత పెరిగింది.