ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ‘Happening Couple’ ఎవరైనా ఉన్నారంటే అది విజయ్ దేవరకొండ ఇంకా రష్మిక మందన్న లే అని అందరు చెప్తున్నారు. మొన్నే కదా వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది అన్న వార్త బయటికి వచ్చింది… ఇక పెళ్లి ఫిబ్రవరి లో జరుగుతుంది అని అంటున్నారు.
ఇక నిన్న రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ సక్సెస్ మీట్ జరిగింది… అక్కడ విజయ్ రాగానే రష్మిక చేతిని ముద్దాడాడు… ఇది చాలదు మనకి!

‘ది గర్ల్‌ఫ్రెండ్’ మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదల రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, మొదట మోస్తరు ఓపెనింగ్ సాధించినా, వీకెండ్‌కి చేరేసరికి టాక్ మరింత బలంగా మారింది. థియేటర్స్‌లో కలెక్షన్లు కూడా పెరిగాయి. అందుకే నిన్న హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ఇంకా రష్మిక విజయ్ గురించి తన స్పీచ్ లో చాల చెప్పింది… “చివరగా కానీ ముఖ్యంగా విజయ్ గురించి చెప్పాలనుకుంటున్నా… విజ్జు ఈ సినిమా మొదలైనప్పటి నుంచే నా వెంట ఉన్నాడు. ఈ రోజు సక్సెస్ మీట్‌కి కూడా వచ్చాడు. ఈ ప్రయాణంలో ఆయన భాగం కావడం నాకు చాలా సంతోషం. ప్రతీ ఒక్కరి జీవితంలో ఒక ‘విజయ్ దేవరకొండ’ ఉండాలి అనిపిస్తుంది… అది నిజంగా ఒక ఆశీర్వాదం.” అని చెప్పి అందరినీ కదిలించింది.
విజయ్ కూడా తన మాటల్లో రష్మికపై మమకారాన్ని వ్యక్తపరిచాడు. “నేను రష్‌ని ఏళ్లుగా చూస్తున్న… ఆమె నటిగా మాత్రమే కాదు, వ్యక్తిగా కూడా ఎంతగా ఎదిగిందో నాకు తెలుసు. నేను కొంచెం ఆగ్రహంగా ఉండే వాడిని కానీ ఆమె ఎప్పుడూ దయను ఎంచుకుంటుంది. ఒక రోజు ప్రపంచం ఆమె నిజమైన స్వభావాన్ని గుర్తిస్తుంది. ది గర్ల్‌ఫ్రెండ్ కేవలం సినిమా కాదు… ఒక ఉద్దేశం. రష్, నువ్వు ఈ స్థాయిలో నిలబడి, ఇతరులకు బలాన్ని ఇచ్చే కథతో నిలవడం నాకు గర్వంగా ఉంది.” అని చెప్పాడు విజయ్.
మరి వర్క్ ఫ్రంట్ విషయానికి వస్తే, విజయ్ దేవరకొండ–రష్మిక జోడీ త్వరలో మళ్లీ కలసి సినిమా చేయబోతున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న పీరియడ్ డ్రామా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రం వచ్చే ఏడాది థియేటర్స్‌లో విడుదల కానుంది.